ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లల్లో చక్కగా పక్క పాపిడి తీసుకుని, బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టుకుని ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తమిళనాట అతడు స్టార్ హీరో. ఇంకో విశేషం ఏంటంటే, పెద్దయ్యాక అతని వెనుక ఉన్న పాపనే పెళ్లి చేసుకున్నాడు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లల్లో చక్కగా పక్క పాపిడి తీసుకుని, బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టుకుని ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తమిళనాట అతడు స్టార్ హీరో. ఇంకో విశేషం ఏంటంటే, పెద్దయ్యాక అతని వెనుక ఉన్న పాపనే పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరో కాదు.. శివ కార్తికేయన్. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తర్వాత తమిళంలో తను నటించిన చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై విడుదలవుతున్నాయి. ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ (బైలింగ్వల్) మూవీతో నేరుగా టాలీవుడ్‌లో మూవీ చేశాడు. ఫోటోలో శివ కార్తికేయన్ వెనకాల ఉన్నది బంధువుల అమ్మాయి ఆర్తి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ సెలబ్రిటీ జంటకు ఓ పాప ఆరాధన, బాబు గుగన్ దాస్ సంతానం.
ఇక శివ విషయానికొస్తే.. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తన జోకులతో జనాల పెదాల మీద నవ్వులు పూయించేవాడు. ముఖ్యంగా రజినీ కాంత్ వాయిస్ పర్ఫెక్ట్‌గా దించేసేవాడు. స్నేహితుడి సలహాతో కామెడీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేశాడు. ‘ఏగన్’ అనే మూవీలో చిన్న పాత్ర చేసే అవకాశమొచ్చింది కానీ తన రోల్ ఎడిటింగ్‌లో ఎగిరిపోయింది. మొదటి సినిమాకే ఇలా అయిందేంటని డీలా పడ్డాడు. డైరెక్టర్ పాండిరాజ్ ‘మెరీనా’ మూవీతో హీరోగా పరిచయం చేశాడు.
తెలుగులో ‘మెరీనా బీచ్’ పేరుతో వచ్చింది. ఈ మూవీతో తమిళంలో మంచి గుర్తింపు రావడంతో పాటు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. హీరో, హోస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, ప్రొడ్యూసర్‌గానూ అలరించాడు. తన కుమార్తె ఆరాధనతో కలిసి ‘కనా’ (కౌసల్య కృష్ణమూర్తి) లో ఓ పాట కూడా పాడాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళంలో ‘మావీరన్’, తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో జూలై 14న గ్రాండ్‌గా రిలీజ్ అవనుంది.