Friendship Day: స్నేహితుల దినోత్సవం/ఫ్రెండ్ షిప్ డే ప్రతీ ఏటా ఆగస్ట్ నెల మొదటి ఆదివారం నాడు వస్తుంది. ఈరోజున స్నేహితులందరూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.స్నేహం గురించి చెప్పడం మొదలుపెడితే భారతం అవుతుంది, రాయడం మొదలుపెడితే రామాయణం అవుతుంది. ఎందుకంటే పురాణ గ్రంథాల్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఫ్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి. శతృవు ఎంత పెద్దోడైనా.. ఫ్రెండ్ వైపు ధర్మం ఉంటే న్యాయం చేసే రాముడవుతాడు. ఆపదొస్తే అర్జునుడి కోసం అండగా నిలబడే కృష్ణుడవుతాడు, స్నేహం కోసం ప్రాణాలనైనా త్యాగం చేసే కర్ణుడవుతాడు. మనలో ఉన్న కంసుడనే చెడుని కృష్ణుడై సంహరిస్తాడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జీవిత సత్యాన్ని బోధిస్తాడు. స్నేహం గురించి ఇంతకంటే అద్భుతంగా నిర్వచించే సినిమాలు కూడా వచ్చాయి.
ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ఒకరిని మాత్రమే ప్రేమిస్తుంది. ఫ్రెండ్ షిప్ కోసం ప్రేమని త్యాగం చేసే స్నేహితుల కథ ఈ ప్రేమదేశం. ప్రేమ కోసం ద్వేషం పెంచుకునే స్నేహితులు చాలా మంది ఉంటారు, కానీ ప్రేమించిన స్నేహితుడే దేశం, ప్రపంచం అనుకునే స్నేహితులు వేళ్ళ మీద లెక్కపెట్టుకునేలా ఉంటారు.
స్నేహానికి డబ్బున్నోడు, డబ్బు లేనోడు, యజమాని, పనోడు అని తేడా లేదని చూపించే సినిమా. ఈ సినిమాలో మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ.. సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్..
స్నేహాన్ని చూసి ఓర్వలేని వ్యక్తి పెట్టిన చిచ్చులో అపార్థాలు, అనుమానాలు, అవమానాలు, గొడవలు ఇవన్నీ దాటుకుని నిలబడిన స్నేహం.. స్నేహితుడెక్కువా? కుటుంబం ఎక్కువా? అంటే స్నేహితుడే ఎక్కువ అన్న స్నేహితుడి కథ. స్నేహితులంటే ఇదే కదా అనిపించిన కథ.. స్నేహమంటే ఇదేరా అని చూపించిన కథ.
అద్భుతమైన కథ. తన స్నేహితుడి కోసం తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి కూడా వెనుకాడడు. ఉదయ్ కిరణ్ లాంటి స్నేహితుడు ఉంటే జీవితం ఎంత బాగుంటుందో. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అసలు. ఈ కేరెక్టర్ ఇండస్ట్రీలో ఏ హీరో చేసినా సినిమా ఫ్లాప్ అవుతుందన్నంత గొప్పగా ఆ పాత్రలో ఒదిగిపోయారు.
స్నేహానికి జెండర్ తో పనిలేదు అని చాటి చెప్పే సినిమా. స్నేహితురాలి జీవితం బాగుండాలని తనకి ఇష్టమైన, ప్రాణమైన, జీవితమైన ఆటని క్రికెట్ ని వదిలేసే స్నేహితుడి కథ.
తరుణ్ హీరోగా, సునీల్, ఆకాశ్, రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురి జీవితాలని గొప్పగా మలిచిన శిల్పి తరుణ్. వీళ్లలో ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దుతాడు గణేష్. దీని కోసం కష్టపడి పనిచేస్తాడు. ఆగిపోయిన జీవితాలకి, ఆవిరైపోయిన ఆశలకి ఆరిపోని జ్యోతిని వెలిగించే స్నేహితుడి కథ.
ఉన్నది ఒకటే ప్రపంచం. ఆ ప్రపంచం స్నేహం మాత్రమే, ఆ ప్రపంచంలో ఉన్నది స్నేహితుడు మాత్రమే అని ఈ సినిమా చెబుతుంది. స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే కథ.
ఫ్రెండ్ కి ఆపదొస్తే ఆ ఆపదకే అడ్డంగా నిలబడతాడు. ఆపదైనా సరే తనని దాటుకుని వెళ్లాలని చెప్తాడు. కానీ దాన్ని దాటనివ్వని వాడే ఫ్రెండ్ అని చెప్పే సినిమా ఈ కేరాఫ్ సూర్య..
భూమ్మీద రవి (నరేష్) లాంటి ఫ్రెండ్ ఉంటే.. ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రమైన భూమ్మీదకు రావాల్సిందే. రిషి అనే ఫ్రెండ్ సక్సెస్ కోసం జీవితాన్ని, జీవితంలో తండ్రిని, ప్రేమని కోల్పోయిన రవి అనే ఫ్రెండ్ కోసం, ఆ ఫ్రెండ్ ఆశయం కోసం రిస్క్ చేసి మరీ ఫ్రెండ్ కళ్ళలో సంతోషాన్ని నింపే గొప్ప స్నేహితుడి కథ ఈ మహర్షి.
ఒక ఫ్రెండ్ ఆశయం మల్లి కోసం. మరొక ఫ్రెండ్ ఆశయం మట్టి కోసం. భీముడి ఆశయాన్ని రాముడు, రాముడి ఆశయాన్ని భీముడు తీరుస్తాడు. ఈ కథలో మొత్తం ఒకరి నొకరు హైలైట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరినీ తెరపై చూస్తే స్నేహం ఇంత గొప్పగా ఉంటుందా? బ్లడ్ రిలేషన్‌లా ఉంటుందా? అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ కూడా అన్నదమ్ముల్లా ఉంటారనడానికి రామ్, కొమరం భీమ్ పాత్రలే నిదర్శనం.
మరి ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? ఏ సినిమాలో మీ ఫ్రెండ్ కనబడ్డారో? కామెంట్ చేయండి. అలానే ఈ ఆర్టికల్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.
ప్రతీ ఒక్కరికీ స్నేహితుల 🫂 దినోత్సవ శుభాకాంక్షలు 💐