గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా సీఎం జగన్ కు సినీ పరిశ్రమ నుంచి 14 విజ్ఞప్తులు చేసినట్టు తెలుస్తోంది.
ఇక సీఎం తో భేటీ అనంతరం సినీన టుడు మహేశ్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొదటగా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఇటీవల సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు వచ్చాయని చెప్పారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారని ఆయన ప్రకటించారు. వారం/పది రోజుల్లోనే ఆ శుభవార్త వస్తుందని చెప్పారు.
ఇది చదవండి: విమానంలోనే మహేష్ బాబుకి చిరు శుభాకాంక్షలు.. పిక్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. టికెట్ ధరల వివాధానికి శుభంకార్డు పడిందని భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమని తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలకు మంచి వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నిర్ణయం అందరినీ సంతోషపర్చిందని చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.