ఫస్ట్ సినిమాలో క్యూట్ అండ్ నాటీ నటనతో ఆకట్టుకున్నారు ఈ నటీమణి కూడా. దీంతో ఆమెకు మంచి అవకాశాలు క్యూ కట్టాయి. దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి వంటి దర్శకుల సినిమాల్లోనే కాదూ టాలీవుడ్‌లో పెద్ద హీరోల సరసన ఆడి పాడింది
కొన్ని సినిమాలు కథ, స్క్రీన్ ప్లే వల్ల ఆడితే.. కొన్ని పాటలు, సంగీతం వల్ల హిట్ అవుతుంటాయి. ఆ సినిమాల్లో నటనతో పాటు డ్యాన్సులు, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వల్ల కూడా హీరో హీరోయిన్లు పేరు తెచ్చుకుంటాయి. ఫస్ట్ సినిమాలో క్యూట్ అండ్ నాటీ నటనతో ఆకట్టుకున్నారు ఈ నటీమణి కూడా. దీంతో ఆమెకు మంచి అవకాశాలు క్యూ కట్టాయి. దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి వంటి దర్శకుల సినిమాల్లోనే కాదూ టాలీవుడ్‌లో పెద్ద హీరోల సరసన ఆడి పాడింది. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, దివంగత నటుడు ఉదయ్ కిరణ్, అల్లరి నరేష్, రాజశేఖర్, అర్జున్ సార్జా వంటి హీరోల పక్కన నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆత్మహత్యకు యత్నించి.. ఆసుపత్రి పాలయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి.. తెరకు దూరమై ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టింది.
ఆమెనే నటి గజాల. ‘ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్న తెలుసా.. అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా’, ‘ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే’అంటూ తన ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది గజాల. జగపతిబాబు, లయ నటించిన నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన గజాల.. తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో అల్లరి పిల్లల, ఆకతాయి అమ్మాయిగా మెప్పు పొందింది. ఆ తర్వాత వెంటనే జూ ఎన్టీఆర్, రాజమౌళి సినిమా స్టూడెంట్ నంబర్ 1లో కనిపించి మెప్పించింది. ఈ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఓ చిన్నదాన సినిమాతో హిట్ హీరోయిన్‌గా మారిపోయింది. కలుసుకోవాలని, అదృష్టం, అల్లరి రాముడు వంటి సినిమాలు చేసింది.
ఆ సమయంలోనే గజాలా ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో సీనియర్ నటుడు అర్జున్‌కు ఫోన్ చేసి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పడంతో.. ఆయన ఆమె ఉంటే ప్రాంతానికి వెళ్లి.. హుటాహుటిన ఆసుప్రతికి తీసుకెళ్లాడు. దీంతో అతడికి, ఆమెకు మధ్య ఏదో నడుస్తుందని మీడియా కోడై కూసింది. దీనిపై ఆ తర్వాత అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ప్రాణాల నుండి బయటపడ్డ గజాలా.. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. బిజీ హీరోయిన్ గా మారింది. మల్లీశ్వరీలో గెస్ట్ అపిరియన్స్ ఇచ్చింది. జానకి వెడ్స్ రామ్, చివరగా తెలుగులో మనీ మనీ మోర్ మనీలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.
హైదరాబాద్ నుండి ముంబయికి మకాం మార్చిన గజాలాకు నటుడు ఫైజల్ రాజాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2016లో వీరూ పెళ్లి చేసుకున్నారు. తన పేరును గజాలా షేక్ ఖాన్‌గా మార్చుకుంది. ముంబయిలో స్థిర పడ్డ తర్వాత ఆమె బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. ‘ఫోటోవాలస్’కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు ఆమె. సినిమా ఇండస్ట్రీ నుండి దూరమై పదేళ్లు దాటుతున్నా.. అదే అందంతో కనిపిస్తుంది గజాలా. ఇసుమంతైనా బరువు పెరగలేదు. అంతే నాజుగ్గా కనిపిస్తుంది.