“జబర్దస్త్” రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి ఎందరో కమెడియన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో నటులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలు సైతం చేస్తున్నారు. తమ అభిమాన నటులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆత్రుత జనాల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నటులు తాము చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వార తెలుపుతూనే ఉంటారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మరో నటి తన కల నెరవేరిందని తెలిపింది. ఆ నటి, ఆ కల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
“గీతూరాయల్”.. టిక్ టాక్ తో పరిచయమైన ఈ భామ తన యాసతో, తన కొటేషన్స్ తో యువతకు బాగా దగ్గరైంది. ఇక జబర్ధస్త్ లోకి వచ్చాక ఆమె క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. పుష్ప మూవీ స్ఫూఫ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. “నా కల నెరవేరింది” అని కారు ముందు దిగిన ఫొటోలను పోస్ట్ చేసి.. మురిసిపోతుంది. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.