ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఏ హీరోకి దక్కనటువంటి అవకాశం చాలా తక్కువ సమయంలోనే ఈ యంగ్ హీరోకి దక్కింది.
సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. సెలబ్రిటీల పుట్టినరోజులు వచ్చినా లేదా వారి సినిమాలు విడుదలైనా గానీ వారికి సంబంధించిన రేర్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలకు సంబంధించిన త్రో బ్యాక్ పిక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఈ ఇద్దరు మామా, అల్లుళ్లను గుర్తుపట్టారా? పట్టి పట్టి చూస్తే ఈ ఫోటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. మరి ఇంకొకరు ఎవరు? పవన్ కాళ్ళ మధ్య క్యూట్ గా చూస్తున్న ఆ బాబుని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలకి దక్కని అరుదైన అవకాశం ఈ హీరోకి దక్కింది.
ఇద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేశారు. సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఉన్న బాబు మరెవరో కాదు, మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ‘బ్రో’ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోని సాయి ధరమ్ తేజ్ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకులుగా డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన సినిమా ‘బ్రో’. జూలై 28న థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసింది. చిత్రం విడుదల సందర్బంగా హీరో సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో తన మేన మామ పవన్ తో ఉన్న తన చిన్ననాటి ఫోటో ఒకటి షేర్ చేశారు.
అంతేకాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమ, అభిమానాన్నంతా మరోసారి చూపించారు. ఈ రోజుని నేను ఏమని పిలువగలను! నేను కన్న కలల్లో ఒక కల నిజమైంది, నిజంగా ఇది మరచిపోలేని రోజు, నేను జీవితాంతం కాపాడుకునే జ్ఞాపకం. మై డ్రీమ్ కమ్ ట్రూ. ఇది ఒక మరపురాని రోజు, నేను జీవితాంతం భద్రపరుచుకునే ఈ జ్ఞాపకంతో పాటు ఈ క్షణంలో నేను అనుభవించే ప్రతి భావోద్వేగాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకుంటే ఆయనే నా గురువు. అంతే కాదు నాకు నడక నేర్పిన తల్లి లాంటి వ్యక్తి మా మావయ్యే. అందుకే ఆయనతో కలిపి ఈ స్కీన్ ని షేర్ చేసుకునే అవకాశం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ క్షణంలో నేను ఈ భూమిపై నిలబడ లేకపోతున్నాను, ఆనందంతో నా మాటలు తడబాటుకు గురవుతున్నాయి. నాకు ఆయనే స్ఫూర్తి, నాకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తి మావయ్యే. ఈ ఆనంద క్షణాలని జీవితాంతం ఇలాగే కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. మావయ్యా నీ చెయ్యి పట్టుకున్న పిల్లవాన్ని అలాంటి నన్ను నమ్మి నాతో కలిసి సినిమా చేసినందుకు మీకు అలాగే త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. నా కలను సాకారం చేసుకోవడంలో మీరు కూడా భాగమైనందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞుడనై ఉంటాను. నన్ను ఆదరిస్తున్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను, మావయ్య కలిసి నటించిన బ్రో సినిమాని విజయవంతం చేసి మా ఇద్దరి కాంబినేషన్‌కి మీ సంపుర్ణమైనా మద్దతు తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారములతో మీ సాయి ధరమ్ తేజ్ అంటూ తన భావోద్వేగభరితంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.