లాక్డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరిగింది.. డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, మూవీస్‌తో జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు.. అయితే ఓటీటీ రంగం ఎంత డెపలప్ అయినా కానీ సినిమాకు..
వినోదం కోసం మెజారిటీ ప్రేక్షకులు సినిమాల మీదే ఆధారపడతారు.. టీవీ, ఓటీటీలున్నా కానీ థియేటర్‌కి వెళ్లి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్.. లాక్డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరిగింది.. డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, మూవీస్‌తో జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు.. అయితే ఓటీటీ రంగం ఎంత డెపలప్ అయినా కానీ సినిమాకు పోటీ కాదనే చెప్పాలి.. వీక్లీ ఓటీటీల్లో కొత్త సినిమాలొస్తున్నా.. కచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమాలు కూడా ఉంటాయి.. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ సందడి వేరేగా ఉంటుంది.. ఇక మల్టీప్లెక్స్‌ల సంగతి చెప్పక్కర్లేదు.. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు అవి కూడా సింగిల్ స్క్రీన్స్ మాదిరిగానే జాతర వాతావరణాన్ని తలపింపజేస్తుంటాయి..
2023 సగం కంప్లీట్ అయిపోయింది.. కాకపోతే బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలు అనుకున్నంతగా సందడి చేయలేకపోయాయి.. సంక్రాంతి సీజన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ తో పాటు ‘వారసుడు’, ‘తెగింపు’ వంటి డబ్బింగ్ బొమ్మలు కూడా అత్యధిక వసూళ్లు రాబట్టాయి.. కట్ చేస్తే ఆ తర్వాత అలాంటి మ్యాజిక్ రిపీట్ కాలేదు.. ‘బలగం’, ‘దసరా’, ‘విరూపాక్ష’ వంటి చిన్న చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ రాకతో వరల్డ్ వైడ్ థియేటర్లు కళకళలాడాయి.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది.. ఎప్పటిలానే ఈ శుక్రవారం (జూన్ 23) కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 9 చిత్రాలు షెడ్యూల్ అయిపోయాయి.. వాటిలో హిందీ, తమిళ్ నుండి డబ్ అయినవి కూడా ఉన్నాయి.. ఆ సినిమాలు, వాటి రన్ టైమ్ అండ్ సెన్సార్‌కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
1) మను చరిత్ర – U/A – 2 గంటల 36 నిమిషాలు
2) అశ్విన్స్ – A – 1 గంట 52 నిమిషాలు
3) రాముడు అనుకోలేదు.. జానకి కలగనలేదు – U – 2 గంటల 20 నిమిషాలు
4) భీమదేవరపల్లి బ్రాంచి – U/A – 2 గంటల 14 నిమిషాలు
5) మా ఆవారా జిందగీ – A – 1 గంట 48 నిమిషాలు
6) భారీ తారాగణం – U/A – 2 గంటల 22 నిమిషాలు
7) జాగ్రత్త బిడ్డా – U/A – 2 గంటల 16 నిమిషాలు
8) 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్ – – A – 2 గంటల 2 నిమిషాలు
9) కుట్ర: ది గేమ్ స్టార్ట్స్ నౌ – U/A – 1 గంట 43 నిమిషాలు