సినీ ప్రపంచంలో ధృవతార, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ సంతాపం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు.. కృష్ణ పార్దివ దేహాన్ని సందర్శించారు. కృష్ణ అభిమానులు భారీ స్థాయిలో నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన నివాస పరిసరాల్లో భారీ రద్దీ ఏర్పడింది. ఇదే సమయంలో జేబు దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు దొంగల బారిన పడి సోమ్ము పొగొట్టుకుని లబోదిబోమన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని తట్టులేక చాలా మంది అభిమానులు గుండెలు పగిలేలా రోదించారు. తమ అభిమాన హీరో ఇక్కలేరనే వార్తను అభిమానులు ముఖ్యం ఆ తరం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈక్రమంలో కడసారి కృష్ణను చూసేందుకు ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. వీరితో పాటు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు వస్తుండటంతో ఆ మార్గంలో రద్దీ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు చేతివాటం చూపించారు. గుంపులో చేరి సెల్ ఫోన్లు, పర్సులను చోరి చేశారు. బాధితులు కొందరిని పట్టుకుని దొంగలు భావించి నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు పెద్ద ఎత్తున హారన్ లు చేస్తూ అక్కడి ఉన్నవారితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు.. ఎవరో గొడవ పడుతున్నారో.. అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. డబ్బులు, పర్సులు, మొబాల్ ఫోన్లు అందును చూసి కొట్టేసిన దొంగలు.. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అయితే పర్సులు, డబ్బులు పోగొట్టుకున్న వారు మాత్రం ఆందోళ చెందారు. తమ అభిమాన హీరోని కడసారి చూద్దామని వస్తే.. దొంగల తమ వస్తువులు కొట్టేశారని లబోదిబోమన్నారు.