సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా తన పాత్రే ప్రధానం. అందులో పరకాయ ప్రవేశం చేసేవాడు. అలాంటి నటుడు ఉన్నట్టుండి అనూహ్యంగా కన్నుమూశారు.
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తనదైన నటనతో సినీ ప్రేక్షుకుల మనసు గెలిచిన ప్రముఖ నటుడు లాన్స్ రెడ్డిక్ అనూహ్యంగా కన్నుమూశారు. ప్రస్తుతం రెడ్డిక్ వయస్సు 60 ఏళ్లు. రెడ్దిక్ మరణవార్తతో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రెడ్దిక్ మరణాన్ని అతని ప్రచారకర్త మియా హాన్సెన్ ధృవీకరించారు. అయితే అతను ఎక్కడ మరణించాడు, ఎలా మరించాడన్న దానిపై స్పష్టత లేదు. సహజ మరణం పొందినట్లు కథనాలు వస్తున్నాయి. రెడ్దిక్ ఎక్కువ భాగం ‘ఇన్వెస్టిగేషన్ యూనిట్’ పాత్రలలో నటించేవారు. అమెజాన్ వెబ్ సిరీస్ “బాష్”లో కూడా నటించాడు. 1996లో వచ్చిన “న్యూయార్క్ అండర్కవర్,” “ది వెస్ట్ వింగ్” వంటి టెలివిజన్ ధారావాహికల ద్వారా రెడ్దిక్ నటుడిగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై తనదైన నటనతో పేరు ప్రఖ్యాతలు పొందాడు.
🚨BREAKING: Commander Zavala’s voice actor Lance Reddick has passed away, TMZ reports.
RIP. pic.twitter.com/GXYeJZMPlb
— Destiny Bulletin (@DestinyBulletn) March 17, 2023
Lance Reddick was such an underrated talent. RIP King 😢 pic.twitter.com/750yFKAtn7
— Dominicc Hardy (@ThaDangerousOne) March 17, 2023