SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Terms And Conditions Of Oscar Nominations

ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

ఆస్కార్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన “ట్రిపుల్ ఆర్” కి ఆస్కార్ రావాలని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు ఇవి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియాలో.. ముఖ్యంగా తెలుగునాట ఆస్కార్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి.. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ రావడం సాధ్యమా? ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభంగా దక్కేది కాదు. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ వస్తుందా? రాదా? అనే విషయం తెలియాలంటే.. ముందుగా ఆస్కార్ అవార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారో తెలుసుకోవాలి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ అందుకోవాలంటే.. సినిమాలు ఎలా ఉండాలి? ఒక ఇండియన్ సినిమాను ఆస్కార్ బరిలో నిలబెట్టాలంటే ఎలాంటి పద్ధతులు/షరతులు ఉంటాయి? అసలు ఆస్కార్ వరకు ఇండియన్ సినిమాలు వెళ్లాలంటే.. ఆ ప్రాసెస్ ఏంటి? దాని వెనుక ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది? ఆస్కార్ నామినేషన్స్ వెనుక అసలు కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

ఆస్కార్ కి మొదటి మార్గం:

ముందుగా మన సినిమాలకు ఆస్కార్స్ లో ‘బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ కేటగిరిలో అవకాశం ఉంటుంది. ఏ దేశం నుండైనా ఆస్కార్ కి ఒక సినిమా ఎంపిక అవ్వాలంటే.. రెండు మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వమే తమ దేశం తరపున ఆస్కార్ కొట్టే ఛాన్స్ దానికి ఉందని ఓ సినిమాను ఎంపిక చేసి ఆఫీషియల్ గా పంపిస్తుంది. మన దేశంలో సినిమాలను ఆస్కార్ కి పంపేందుకు ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI)’ కమిటీ ఉంటుంది. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లే సినిమాల వెనుక ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు నియమించిన కమిటీ, చైర్మన్, సభ్యులు ఇలా చాలామంది ఉంటారు. ఇండియా నుండి ఆస్కార్ కి అధికారికంగా వెళ్లాల్సిన సినిమాలేవో వారే నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులోకి ఇండియా నుండి గుజరాతీ మూవీ చెల్లో షో(Chhello show) అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది.

ఆస్కార్ కి రెండో మార్గం:

ఇక ఆస్కార్ కి ఎంపిక అయ్యేందుకు రెండో మార్గం జనరల్ కేటగిరి. దీనికి ఎవరైనా తమ సినిమాలను సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ.. ఇక్కడ కొన్ని షరతులు ఉంటాయి. అవేంటంటే.. సినిమా ఆ ఏడాది జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపే రిలీజ్ అయ్యుండాలి. సినిమా ఖచ్చితంగా యూఎస్ లోని మెట్రో నగరాలలో మినిమమ్ వారం రోజులైనా థియేట్రికల్ రన్ అయ్యుండాలి. సినిమా రన్ టైమ్ 40 నిమిషాలకు పైనే ఉండాలి. మూవీని 35mm లేదా 70mm ఫార్మాట్ లో తీసుండాలి. ఫారెన్ మూవీ అయితే.. ఆడియో ట్రాక్ లో మినిమమ్ 50% పదాలు వేరే లాంగ్వేజ్ వి ఉండాలి. ఇలా చాలా కండిషన్స్ ఉన్నప్పటికీ, ప్రధానంగా మొదటి రెండు రూల్స్ తప్పనిసరి. ఆ విధంగా ఎలిజిబుల్ అయిన సినిమాలను ఆస్కార్ వాళ్ళు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’ అని రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ కేవలం అర్హత కలిగినవి అని చెప్పడానికి మాత్రమే. ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు.. ‘బెస్ట్ ఇంటెర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో తప్ప మిగతా వాటిలో నామినేషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. కానీ.., ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

“బెస్ట్ పిక్చర్” కేటగిరీలో RRR కి ఛాన్స్:

ఇండియా నుండి ఆఫీషియల్ ఎంట్రీ రాలేదు కాబట్టి.. ఆర్ఆర్ఆర్.. “బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్” కేటగిరీలో పోటీ పడే ఓ మంచి అవకాశం మిస్ చేసుకుందని చెప్పాలి. మరోవైపు ఆర్ఆర్ఆర్, చెల్లో షో సినిమాలతో పాటు బెస్ట్ డాక్యూమెంటరీ ఫిలింగా ‘ఆల్ దట్ బ్రీత్స్’, బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిలింగా ‘ది ఎలిఫాంట్ విస్పరర్స్’ షార్ట్ లిస్ట్ కి ఎంపికయ్యాయి. మరి గవర్నమెంట్ అఫీషియల్ గా ఎంపిక చేయని సినిమాలకు ఛాయస్ లేదా? అంటే.. వీటికి “బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్” కేటగిరీలో కాకుండా “బెస్ట్ పిక్చర్” కేటగిరిలో పోటీపడే ఛాన్స్ ఉంటుంది.

Oscar award details

ఇక జనరల్ గా ఆస్కార్ లో ఏ కేటగిరి అయినా 5 నామినేషన్స్ వరకే ఫైనల్ చేస్తారు. కానీ.. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో 10 నామినేషన్స్ వరకు ఛాన్స్ ఇస్తారు. ఈ మధ్య మీరు గమనించినట్లైతే.. ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళి టీమ్ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. స్పెషల్ స్క్రీనింగ్స్ తో పాటు హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, రైటర్స్ కి సినిమా చూపించారు. ఇంత కష్టం దేనికి అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ కమిటీ మెంబర్స్ కి.. ట్రిపుల్ ఆర్ మూవీని పరిచయం చేసి.. వారి ఓట్లు పొందటానికి. ఇలా ప్రమోట్ చేసుకున్న సినిమాల్ని ఆస్కార్ కమిటీలో ఉన్నవారు నామినేట్ చేస్తే.. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఆస్కార్ ఓటింగ్ ప్రాసెస్ :

ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. ముందుగా రిమైండర్ లిస్ట్ లో ఉన్న అన్నీ సినిమాలకు.. అన్నీ కేటగిరీల ఆస్కార్ మెంబర్స్ ఓటింగ్స్ వేస్తారు. అలా మల్టీపుల్ రౌండ్స్ అయ్యాక.. నామినేషన్స్ లో పోటీపడే 5 సినిమాలను ఫైనల్ చేస్తారు. ఇక విన్నర్ ఎవరో తెలియాలి కదా.. అందుకోసం మొత్తం వేల సంఖ్యలో ఉన్న ఓటింగ్ మెంబర్స్ మరోసారి ఫైనల్ ఓటింగ్ వేస్తారు. ఈ ఫైనల్ ఓటింగ్ ప్రతి కేటగిరిలోనూ జరుగుతుంది. ఇప్పుడు మన నాటు నాటు సాంగ్ కూడా.. ఇలా “బెస్ట్ ఒరిజినల్ సాంగ్” కేటగిరీలో ఉంది.

PR ఏజెన్సీల పాత్ర:

మరి ఆస్కార్ రిమైండర్ లిస్ట్ లో ఉన్న వందల సినిమాలను కమిటీ మెంబర్స్ చూస్తారా? అనంటే.. అన్ని సినిమాలు ఎవరూ చూడలేరు కదా! అందుకే మధ్యలో పిఆర్(PR) ఏజెన్సీలు ఎంటరై.. బజ్ ఉన్న సినిమాలను ఆస్కార్ మెంబర్స్ కి సజెస్ట్ చేస్తాయి. వాళ్ళ కోసమే స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేసి.. సినిమాను ప్రమోట్ చేస్తుంటాయి. ఈ ప్రమోషన్స్ కి భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు సినిమాను మించిన ఖర్చు కూడా అక్కడే అవ్వొచ్చు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొనే కొంతమంది ఆస్కార్ క్యాంపెయినింగ్ కి, ఆస్కార్ ఆలోచనకి దూరంగా ఉంటారు. కానీ.. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఈ ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చి, మాక్సిమమ్ సినిమాను కమిటీ దృష్టిలో పడేలా ప్రయత్నిస్తుంటాయి. ఇన్ని రోజులు విదేశాల్లో రాజమౌళి అండ్ టీమ్ చేసిన పని ఇదే.

Oscar award details

ఇదిలా ఉండగా.. మరోవైపు సినిమాలకు లభించే ఇంటర్నేషనల్ అవార్డులు.. ఆస్కార్ కమిటీలో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. ఆ విధంగా ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలంటే.. దాని వెనుక చాలామంది జ్యూరీ మెంబర్స్ తో పాటు కొన్ని వేలమంది కమిటీ మెంబర్స్ ఓటింగ్స్ ప్రాసెస్ ఉంటుంది. సో.. కుంభస్థలం కొట్టాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ని మించిన ఖర్చు కూడా భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్కార్ కోసం తమ సినిమాలను తామే ప్రమోట్ చేసుకోవాలి అనేది వాస్తవం. సో.. ఓ ఆస్కార్ అవార్డు రావాలంటే ఇంత కష్టం ఉంటుంది. ఇన్ని సవాళ్లు ఉంటాయి. ఇంత యుద్ధం చేయాల్సి ఉంటుంది. మరి.. ట్రిపుల్ ఆర్ ఏదో ఒక విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించాలని కోరుకుందాము. ఆల్ ది బెస్ట్ టు జక్కన్న అండ్ హిజ్ టీమ్.

Tags :

  • Academy of Motion Picture Arts and Sciences
  • Movie News
  • Oscar Rules
  • Oscars 2023
  • Oscars entry
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam