కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. గత కొంతకాలంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో తమిళనాట సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. తాజాగా అజిత్ నటించిన తునివు సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదలైన ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో తెగింపు టైటిల్ తో విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఓ రేంజ్ లో బిజినెస్ జరిగింది.
తమిళనాడులో 58 కోట్లు, కర్ణాటకలో 3.60 కోట్లు, కేరళలో 2.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్లు.. ఇతర ప్రాంతాల్లో 1.50 కోట్లు, ఓవర్సీస్ లో 15 కోట్ల మేర బిజినెస్ జరిగింది. టోటల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే దాదాపు 84 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ డే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. తమిళనాడులో 24.59 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కర్ణాటకలో 4.55 కోట్లు, కేరళలో 1.42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 39.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోగా.. 20.10 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో అజిత్ కి పెద్దగా మార్కెట్ లేకపోయినప్పటికీ మంచి కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. తెలుగులో మొదటి రోజు తెగింపు సినిమా అజిత్ స్థాయికి తగ్గట్టే 3.20 కోట్ల బిజినెస్ చేసింది.
తెలుగులో 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా 2.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 1.14 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే ఇంకా 2.36 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. 85 కోట్ల టార్గెట్ ని రీచ్ అయితే సినిమా గట్టు ఎక్కేసినట్టే. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20.10 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా లాభాల గట్టెక్కాలంటే ఇంకా 64.90 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మరి అజిత్ నటించిన తునివు, తెగింపు సినిమాలు ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబడతాయో లేదో చూడాలి. కానీ తెలుగులో మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#Thunivu Day 1 Box Office
👉Tamilnadu : ₹22 Cr
👉Andhra & Nizam : ₹2.20 Cr
👉Kerala : ₹1.75 Cr
👉Karnataka : ₹4.77 Cr
👉Rest of India : ₹1 Cr
👉Overseas : ₹11 Cr / $1.7 MnTotal Worldwide Gross : ₹42.72 Cr
Very good opening 👍
— Filmy Track (@Filmy_Track) January 12, 2023
Pongal 2023 TN Box Office Day 1#Thunivu – ₹ 24.59 cr#Varisu – ₹ 19.43 cr
— Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2023