కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా బంగార్రాజు టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘డెవిల్ ఈజ్ బ్యాక్‘ అంటూ బంగార్రాజు సినిమా నుంచి కింగ్ నాగ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాలోలాగానే తెల్లపంచ, తెల్లచొక్కా, నల్ల కళ్లజోడు పెట్టుకుని స్వర్గం నుంచి దిగుతున్నట్లు నాగార్జున లుక్స్ అదిరిపోతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 25న ప్రారంభమైంది.
ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణానే నటిస్తోంది. ఇంక ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన కన్నడ బ్యూటీ కృతీశెట్టి నటిస్తోంది. హ్యాపీ బర్త్ డే టూమై కింగ్ అంటూ నాగార్జున లుక్‌ను నాగచైతన్య రివీల్ చేశాడు.