నందమూరి తారకరత్న హఠాన్మరణం ఆయన ఫ్యామిలీని తీరని శోకంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది. ఫిబ్రవరి నెలలో తారకరత్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కార్డియక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఇప్పటికి తారకరత్న చనిపోయి.. నెల రోజులు దాటింది. అయినా భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ఒకటి పెట్టింది.
సినీ నటుడు నందమూరి తారకరత్న హఠాన్మరణం ఆయన ఫ్యామిలీని తీరని శోకంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది. ఫిబ్రవరి నెలలో తారకరత్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కార్డియక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఇప్పటికి తారకరత్న చనిపోయి.. నెల రోజులు దాటింది. అయినా భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. తారకరత్న అస్వస్థతకు గురైనప్పటి నుండి బాలకృష్ణ దగ్గరుండి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారు. కష్టకాలంలో తారకరత్న ఫ్యామిలీ పట్ల తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు బాలయ్య.
ఆల్రెడీ తన ప్రాతినిధ్యంలో నిర్మితమవుతున్న హిందూపురం హాస్పిటల్ లో ఓ బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టారు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఆపరేషన్స్ చేయించనున్నట్లు ప్రకటించారు. అయితే.. బాలయ్య తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం గురించి తెలుసుకున్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ఒకటి పెట్టింది. ప్రస్తుతం బాలయ్యను ఉద్దేశిస్తూ అలేఖ్య రెడ్డి పోస్ట్ చేసిన నోట్ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి బాలయ్యను ఉద్దేశిస్తూ.. “మీ గురించి ఏమని చెప్పాలి? ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయగలను. మీ గురించి నేనెంత చెప్పినా తక్కువే అవుతుంది. మిమ్మల్ని బంగారం లాంటి మనసున్న గొప్ప మనిషి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఆ పేరుకి అర్హులు. మీరు తప్ప మరెవరూ అందుకు అర్హులు కాలేరు. నాకు మీరు తండ్రి కన్నా ఎక్కువ. ఇప్పుడు నాకు మీలో ఒక భగవంతుడు కనిపిస్తున్నాడు. మీరు తీసుకున్న గొప్ప నిర్ణయానికి నోట మాట రావట్లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం’ అని పేర్కొంది. అలేఖ్య రెడ్డి పోస్ట్ చూసిన నందమూరి అభిమానులు.. ‘మా బాలయ్య మనసు బంగారం’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలయ్యను ఉద్దేశించి అలేఖ్య రెడ్డి పెట్టిన ఎమోషనల్ నోట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.