టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా పాన్ ఇండియా సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు అన్ని కోట్లు అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
తాజాగా మేజర్ సినిమాను వీక్షించిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీ నటీనటులను, చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. ‘నిన్ననే ‘మేజర్’ సినిమా చూశాను. చాలా బాగా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిత్రబృందానికి నా అభినందనలు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా తీశామని, ఖర్చుగా భారీగా అయ్యింది. లాస్‌లు వస్తున్నాయి.. కాబట్టి సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడంటూ ముఖ్యమంత్రులను కోరుతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu – Rajamouli: రాజమౌళి – మహేశ్ సినిమా! ఇద్దరి మధ్య ఆ ఒక్క కండీషన్!ఒక సినిమా నిర్మాణానికి అంత భారీ ఖర్చు ఎందుకు అవుతోంది? మేజర్ మూవీని రూ.25 కోట్ల మాత్రమే పెట్టి పూర్తి చేశారని తమ్మారెడ్డి అన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాకు ఏ మాత్రం కూడా తీసిపోదని అభిప్రాయపడ్డారు. మిగతా పాన్ ఇండియా సినిమాలను చూసుకుంటే గనుక అన్ని వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలను తీస్తున్నారు. అన్ని కోట్లు అవసరమా అంటూ కూడా తమ్మారెడ్డి ప్రశ్నించారు. షూటింగ్ పేరుతో క్యారవాన్‌లో కూర్చుంటున్నారా? అని ప్రశ్నించారు. పాన్ ఇండియా సినిమాలపై తాజాగా తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలపై తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.