పులిని చూసి నక్కను వాత పెట్టుకోవద్దన్న ఉద్దేశంతో 80 కోట్లతో 10 సినిమాలు తీస్తానని అన్నాను అని అంగీకరించారు తమ్మారెడ్డి. ఇండస్ట్రీలో చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరినీ గౌరవించాలని, కలుపుకుని పోవాలన్నారు. తాను ఇలా ఉన్నానంటే ఇండస్ట్రీ కారణమన్నారు. ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వరుసగా పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం 80 కోట్లకు ఖర్చు పెట్టారంటూ.. ఆ డబ్బులతో ఓ పది చిన్న చిత్రాలు తెరకెక్కించవచ్చు అన్నారని వార్తలు గుప్పుమనగా..దీనిపై నటుడు నాగబాబు, దర్శకుడు రాఘవేంద్రరావు ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ విషయం సద్దుమణుగంది. అయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ విషయాలు ప్రస్తావిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.
కొంత మంది తన మాటలను వక్రీకరిస్తున్నారని భరద్వాజ్ అన్నారు. ‘పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. మంచి ఐడియాలజీ ఉంది, మంచి చేస్తాడని భావించాం, ఆ తర్వాత ఆ పార్టీ.. ఈ పార్టీతో జతకడుతుంటే.. కొంచెం నిలకడగా ఉండమని చెప్పాం. ఆయన బీజెపీతో జత కడుతుంటే.. వద్దని జన సైనికులు కూడా చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం.. వారు పవన్ కళ్యాణ్ తో విభేధించినట్లా’ అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకోమని, కానీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఇలా చేద్దామనకున్నావని, అదీ నచ్చక చెప్పానని, దీంతో తనపై దాడి జరిగిందన్నారు. దీంతో నీ స్థాయి ఏంటీ, మాట్లాడే హక్కు ఉందా అంటూ ప్రశ్నలు వచ్చాయన్నారు. ఇటువంటి వారిని వెనకేసు రావద్దని మాత్రమే సూచించామన్నారు. ఇదొక చైన్ లా అవుతుందని, నాయకుడు బ్రేక్ చేస్తేనే అది తెగుతుందని అన్నారు.
‘తాను పులిని చూసి నక్కను వాత పెట్టుకోవద్దన్న ఉద్దేశంతో 80 కోట్లతో 10 సినిమాలు తీస్తానని అన్నాను. ఇండస్ట్రీలో చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరినీ గౌరవించాలి, కలుపుకుని పోవాలి. తాను ఇలా ఉన్నానంటే ఇండస్ట్రీ కారణం. అలాంటి ఇండస్ట్రీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదు. అలా చేయటం వల్ల నాకేం వస్తుంది. ఎవడో బుద్ధి లేనివాడు నన్ను అంటున్నాడు. అలాంటి వారిని చూసి నవ్వి ఊరుకుంటాను. ఏదైనా ఇండస్ట్రీలో సమస్య వచ్చినప్పుడు మహేష్ బాబు రావడం లేదని చాలా మంది అడుగుతుంటారని ఆయన ఎందుకు రావాలి’ అని ప్రశ్నించారు. ‘మహేష్ బాబుకు అన్యాయం జరిగిన రోజు ఒక్కడూ నిలబడలేదు.. అతని వెంట. అతడు చాంబర్‌లో కూర్చున్నాడు. కానీ ఎవ్వరూ రాలేదు. పవన్ కళ్యాణ్ రాలేదు కానీ ఐ యామ్ విత్ యు అని.. సపోర్ట్ నిలుస్తాను అని చెప్పారు’అని తెలిపారు. ఎందుకంటే నేను చాంబర్‌కి వచ్చేసరికి మహేష్ మాత్రం ఉన్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెస్పాన్స్ మిగతా హీరోలు ఇవ్వలేదన్నారు.
‘సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అవ్వడానికి ఓ కారణం పైరసీ అని అనుకుంటున్న సమయంలో ఓ హీరో (మహేష్) ధైర్యంగా వెళ్లి.. హీరోలా పట్టుకుంటే.. ఆయనను పోలీసులు అరెస్టు అంటూ హడావుడి చేస్తుంటే.. అడగడానికి ఇక్కడ మొగోడు లేడా. మళ్లీ మొగోడు అంటే కాంట్రవర్సీ అయిపోతుంది. వీళ్లందరికీ మాట్లాడటానికి ఏం హక్కుంది. అప్పటి నుండి మహేష్ ఇక రాను అని చెప్పేశాడు. అంతక ముందు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అందరితో కలిసేవాడు. ఇప్పుడు ఆయన పని ఆయన పని చేసుకుంటున్నాడు’. పోనీ పవన్ కళ్యాణ్‌తో ఎవరైనా తోడొచ్చారా .. ఎవరికైనా తోడు వచ్చారా అంటూ ప్రశ్నించారు. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్‌కి అండగా ఎవరూ నిలబడలేదని గుర్తు చేశారు.
రిపబ్లిక్ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్‌పై స్పందించారు. కానీ ఆ స్పీచ్ కారణంగా ఓపెనింగ్స్ పోయాయన్నారు.. ఆ సినిమా మంచిది కానీ పోయిందన్నారు. ఆయన అక్కడ మాట్లాడటం మంచిది కాదన్నాను, దాన్ని కూడా కాంట్రవర్సీ చేశారు.‘మంచి చెబితే చెడు అంటే నేనేం చేస్తాను. ప్రతి దానికి నన్ను అంటారు కదా. నేనొకటి అడుగుతాను. ఓ ఎంపీ, ఎమ్మెల్యే సినిమా వాళ్ల ఫ్యామిలీస్ ఆడవాళ్లందరూ చెడిపోయినోళ్లు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. నేను ప్రతి ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై ఘాటుగా మాట్లాడతాను. ఆర్ఆర్ఆర్ మీద నేనేదో మాట్లాడితే వచ్చిన మొగోళ్లంతా అప్పుడు ఏం పీకుతున్నారు.. అప్పుడేమయ్యారు. వారి భార్యలు, తల్లులు, చెల్లెలు గురించి కాదా మాట్లాడండి. అలాగే ఇటీవల ఓ ఎమ్మెల్యే ఆస్తులు దోచుకున్నారు అన్నారు. అప్పుడు నన్ను ఛాలెంజ్ చేసిన వారంతా అప్పుడు ఏమయ్యారు.’ అంటూ ప్రశ్నించారు.