విప్లవ సినిమాలు తీసి వాటితో కూడా హిట్ కొట్టొచ్చు అని నిరూపించారు నటుడు కమ్ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి. ప్రజల్లో చైతన్యం నింపేలా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఆర్. నారాయణ మూర్తి గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కామెడీ, హారర్, కుటుంబ కథా చిత్రాలతోనే కాదూ.. విప్లవ సినిమాలు తీసి వాటితో కూడా హిట్ కొట్టొచ్చు అని నిరూపించారు నటుడు కమ్ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి. ప్రజల్లో చైతన్యం నింపేలా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే దిట్ట. అందుకే ఆయన్ను అందరూ పీపుల్స్ స్టార్ అంటారు. ఆయన తీసిన సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్ లపైనా అవగాహన ఉంది ఆయనకు. అన్ని సినిమాలు తీసినా, అన్ని హిట్లు కొట్టినా.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు ఆయనకు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడక లేదా అద్దె వాహనాల్లో వెళుతుంటారు. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. అవివాహితుడు అయిన ఆర్. నారాయణ మూర్తి గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఓ విశిష్టమైన వ్యక్తిని గురించి చెబుతానంటూ ఆర్ఆర్ నారాయణ మూర్తికి పేరు చెప్పారు. ఆయన వ్యక్తిత్వం, ఆచరించే విధానం గురించి మాట్లాడతానన్నారు .. ‘ ఆయనొక విప్లవ శక్తి. తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. ఆలోచింప చేశాడు. ఆలోచనలు మార్పించాడు. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తన ఆశయం కోసం..తను నమ్మిన సినిమాలు తీశాడు’అని తెలిపారు.
‘సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్‌ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు. ఆయన సినిమాలన్నీ అలానే ఉంటాయి. మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి అని నేను చాలాసార్లు చెప్పాను గానీ ఆయన వినిపించుకోలేదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసమే సినిమా తీస్తాను అని విప్లవ పంథాలోనే తీశారు. సంపాదించాడు. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. కొన్ని సినిమాలతో కూడా రికార్డులు సృష్టించాడు. అంత డబ్బు సంపాదించి కూడా సమాజ సేవకు ఉపయోగించాడు. సినిమాలు ఎప్పుడు తీస్తుంటాడో తెలియదు. రెండు, మూడు నెలలు అడవుల్లో సినిమాలు తీసి సినిమా కంప్లీట్ చేసేశాను బాస్‘ అంటాడని చెప్పారు.
తను నమ్మిన సిద్ధాంత కోసమే సినిమాలు చేస్తున్నాడని, కానీ సిద్ధాంతం కోసం సినిమాలు చేసే వారున్నారా అంటే అది ఆర్ నారాయణ మూర్తేనని అన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా చాలదు అన్నారు. చలి చీమలు, ఒరేయ్ రిక్షా వంటివి ఆ రోజుల్లో రికార్డులు సృష్టించాయన్నారు. ఆయన చేసిన సినిమాలను చూసి పెద్ద వాళ్ల దగ్గర నుండి చిన్న వాళ్ల వరకు అందరూ ఈ సినిమాలు చేసినవారున్నారన్నారు. అలా ఓ సీజన్ లో విప్లవ సినిమాల ఒరవడి నడించిందన్నారు. అంత ఇంపాక్ట్ చేసిన వ్యక్తి ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరన్నారు. ఓ సినిమా పద్ధతిని మార్చేసిన మనిషి ఆయనేన్నారు. ఇప్పుడు యూనివర్శిటీ సినిమా తీశారని, విద్యార్థులు, వారి కష్టాల కోసం తీశారని అనుకుంటున్నానన్నారు. విద్య, వైద్యానికి ప్రమోట్ చేయడాన్ని వ్యతిరేకించారన్నారు. విద్య, వైద్యాన్ని అమ్ముకుంటూ దాన్ని వ్యాపారంగా చేసుకుని విధానాన్ని ఆయన ఒక్కరే ఎత్తి చూపగలరని అన్నారు.