సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోహీరోయిన్లకు సంబంధించిన సినిమా, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని వారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన శుభవార్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు చిరంజీవి. తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఓ శుభవార్త చెప్పాడు. పెళ్లైన ఎనిమిదేళ్ల తరువాత ఆయన తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్య, నయనతార కాంబినేషన్ లో వచ్చిన రాజారాణి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచమయ్యాడు. అంతక ముందు వరకు స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. తొలి సినిమా రాజరాణితోనే సూపర్ హిట్ అందుకున్న అట్లీ.. ఆ తరువాత దళపతి విజయ్ తో కలిసి తేరి, మెర్సెల్, బిగిల్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు అలానే విజయ్ తో అట్లీ మరోసినిమా చేస్తున్నాడు. ఇలా తనదైన డైరెక్షన్ తో మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అట్లీ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు.
ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. ఈ స్టార్ డైరెక్టర్, నటీ ప్రియ మోహన్ తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు. ఈక్రమంలోనే 2014లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లైయిన 8 ఏళ్ల తరువాత అట్లీ దంపతులు శుభవార్త చెప్పారు. వారు పేరేంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య ప్రియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. వారిద్దరు కలిసిన దిగిన ఫోటోనూ షేర్ చేస్తూ.. “ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, ఆశ్వీర్వాదాలు కావాలి” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి.. మీరు కూడా అట్లీ దంపతులకు కంగ్రాట్స్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.