SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tamil Actor Prabhu Admitted In Chennai Hospital Due To Kidney Problem

నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

1980-90 దశకాల్లో హీరోగా అలరించిన ప్రభు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమా ద్వారా ఈ తరం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభు.. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Wed - 22 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

సీనియర్‌ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికి.. డబ్బింగ్‌ చిత్రాలు, డైరెక్ట్‌ తెలుగు చిత్రాల్లో నటించడంతో.. తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, డార్లింగ్‌, శక్తి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రభు. ప్రస్తుతం ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు ప్రభు. ఈ ఏడాది విడుదలైన తమిళ బ్లాక్‌ బాస్టర్‌ పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1లో కూడా ప్రభు నటించారు. ఇక తాజాగా విడుదలైన వారసుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభు.. తాజాగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు..

ప్రభు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. సమస్య తీవ్రం కావడంతో.. మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుని పరీక్షించిన వైద్యులు యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయనకు మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రభు ఆస్పత్రిలో చేరారనే వార్త తెలిసి ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ప్రభు అనారోగ్యం గురించి తెలియడంతో.. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. ధైర్యం చెబుతున్నారు. ప్రభు ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

actor prabhu

ప్రభు.. ప్రముఖ తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ కుమారుడు. బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుననారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు ప్రభు.. 80,90 దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రభు.. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.

ప్రభు తమిళంలోనే కాక.. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ తండ్రిగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనూ కనిపించారు. ఆ తర్వాత శక్తి సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. డైరెక్ట్‌, డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంటారు ప్రభు. ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిసి అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

  • Actor Prabhu
  • chennai
  • Kidney Disease
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam