సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ మైలస్వామి(57) కన్నుమూశారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యలతో ఆయన కాలంచేసినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మైలస్వామిని కుటుంబసభ్యులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే సమయానికే మైలస్వామి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మైలస్వామి మృతి పట్ల తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమాలతో మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వనికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
మైలస్వామి సినిమాల్లోకి రాకముందు మిమిక్రీ చేసేవారు. 1984లో ఆయన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పాత్ర సంబంధం లేకుండా తనకు అందివచ్చిన పాత్రకు న్యాయం చేసేవారు. 2000 సంవత్సరం తర్వాత ఆయనకు చాలా సినిమాల్లో కమెడియన్ పాత్ర దొరికింది. ఆ తర్వాత ఆయన కమెడియన్ గానే కొనసాగారు. ముఖ్యంగా నటుడు వివేక్ తో కలిసి చాలా చిత్రాల్లో హాస్య సన్నివేశాలను పండించారు. మైలస్వామి మొత్తం వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా టీవీ షోలతో హోస్ట్ గా కూడా కొనసాగారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా మైలస్వామి సుపరిచితుడే.
మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి తారకరత్న మృతితో తెలుగు ప్రేక్షకులు, నటులు అంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో అస్వస్థకు గురైన తారకరత్న ఆ తర్వాత కోమాలోకి వెళ్లారు. మొత్తం 23 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. విదేశాల నుంచి స్పెషలిస్టులను పిలిపించి తారకరత్నను కాపాడేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ, చికిత్సకు తారకరత్న శరీరం స్పందించలేదు. శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు తారకరత్న మృతిపట్ల సంతాపం తెలియజేశారు.
తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ మైలస్వామి(57) కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.#Mayilsamy #PassedAway #TamilCinema #TeluguNews #SumanTV
— SumanTV (@SumanTvOfficial) February 19, 2023