కెరీర్ బాగుండాలని అమ్మ వారికి, స్వామి వారికి పూజలు చేస్తుంటారు. ఆ మధ్య రష్మిక, రీసెంట్ గా సమంత వంటి హీరోయిన్లు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. తాజాగా తమన్నా కూడా హిమాలయాలకు వెళ్లి అక్కడ లింగ భైరవి ఆలయంలో పూజలు నిర్వహించారు.
హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో ఎలా ఉన్నా.. నిజ జీవితంలో దేవుడి పట్ల తమకున్న భక్తి భావాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు. సినిమా హీరోలు అయ్యప్ప స్వామి మాల ధారణ ధరించడం, మొక్కులు చెల్లించుకోవడం వంటివి చేస్తుంటారు. కెరీర్ బాగుండాలని అమ్మ వారికి, స్వామి వారికి పూజలు చేస్తుంటారు. ఆ మధ్య రష్మిక, రీసెంట్ గా సమంత వంటి హీరోయిన్లు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. తాజాగా తమన్నా కూడా హిమాలయాలకు వెళ్లి అక్కడ లింగ భైరవి ఆలయంలో పూజలు నిర్వహించారు. వీలు కుదిరినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రల్లో భాగంగా.. ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తున్న తమన్నా.. తాజాగా హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ దేవి ఆలయాన్ని సందర్శించారు.
ఇషా యోగా సెంటర్ లో శక్తివంతమైన లింగభైరవి దేవికి పూజలు నిర్వహించారు. కాషాయ వస్త్రాలు ధరించి.. పూజ నిర్వహించారు. సినిమాల్లో హీరోయిన్లను చూసి ప్రజలు ఆరాధిస్తారని, అయితే జీవిత మార్గాల కంటే కూడా పెద్దవైన ఆటలు ఆడాలని, ఆ ఆట స్త్రీ స్వరూపాన్ని చూపించేది అయి ఉండాలని అన్నారు. స్త్రీ స్వరూపం అంటే ఏమిటో చెప్పే సరైన పాత్రలో జీవించాలని.. స్త్రీ స్వరూపం అంటే ఏంటో అనే ప్రశ్న తనలో మొదలైందని అన్నారు. తనను తాను ప్రశ్నించుకుంటే.. ఇషా యోగా సెంటర్ లో ధ్యానలింగను దర్శించినప్పుడు సమాధానం దొరికిందని అన్నారు. ఓ ఆహ్వానం మేరకు హిమాలయాలకు వచ్చానని, లింగభైరవి దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశానని ఆమె అన్నారు.
ప్రశాంతతో కూడిన మానసిక ఉల్లాసం కలిగిందని.. జీవితం పట్ల, అపజయాల పట్ల, మరణం పట్ల భయాలు ఉండేవని.. అయితే ఇప్పుడు ఆ భయాలు తగ్గిపోయాయని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. తమన్నా భక్తిని చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత, కాజల్ వంటి హీరోయిన్లు తమన్నా భక్తిని మెచ్చుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. తమన్నా జైలర్, భోళా శంకర్, బాంద్రా సినిమాల్లో నటిస్తున్నారు. కాగా తనలో ఉన్న భయాలను తొలగించుకునేందుకు ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. మరి భక్తి మార్గంలో కనిపిస్తూ స్త్రీ స్వరూపానికి అర్థం చెబుతున్న తమన్నాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.