సాధారణంగా హీరోహీరోయిన్స్.. ఒకరి గురించి ఇంకొకరు మీడియా ముందు ఏం చెబుతారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా.. డార్లింగ్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా సినిమాలలో కలిసి నటించిన తర్వాత హీరోహీరోయిన్స్.. ఒకరి గురించి ఇంకొకరు మీడియా ముందు ఏం చెబుతారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దాదాపు కలిసి నటించాక వారి మధ్య ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే.. సినిమా టైంలో వారికంటూ ఓ స్పెషల్ ఫ్రెండ్ షిప్ బిల్డ్ అవుతుంది. కాబట్టి.. ఎక్కడైనా పాజిటివ్ గానే చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే వారి క్లోజ్ నెస్ బట్టి.. సెటైర్స్ కూడా వేసుకుంటుంటారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా.. డార్లింగ్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారాయి.
తమన్నా, ప్రభాస్ ల క్రేజ్ గురించి పాన్ ఇండియా వైడ్ తెలిసిందే. ఇద్దరు కలిసి రెబల్, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు చేశారు. వారి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉంది. ఈ విషయం ఎన్నోసార్లు సినిమా ఈవెంట్స్ లో.. ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కానీ.. ప్రభాస్ అన్నింటికన్నా ముందు స్నేహానికి విలువ ఇస్తాడు. ఎవరికైనా సాయం చేయడంలో ముందుంటాడు. ముఖ్యంగా అందరికి కడుపునిండా భోజనం పెట్టందే వదలడు. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఇప్పటివరకు ఎన్నో మాటలు విన్నాం. సెలబ్రిటీలు, తనతో సినిమాలు చేసిన హీరోయిన్స్ సైతం ప్రభాస్ ఆతిథ్యం గురించి గొప్పగా చెబుతుంటారు. తాజాగా తమన్నా కూడా ప్రభాస్ ఆతిథ్యం గురించి మాట్లాడింది.
“ప్రభాస్ ఆతిథ్యం గొప్పగా ఉంటుంది. మనం 30 వంటకాల గురించి మాట్లాడుకుంటాం. కానీ.. ప్రభాస్ కి డబ్బు అస్సలు లెక్క కాదు. కేవలం ప్యూర్ హార్ట్ తో అందరికి స్పెషల్ అనుభూతిని అందిస్తాడు. ప్రభాస్ అంటే.. నిజమైన రాజుకు ఓ సరైన వివరణ. ప్రభాస్ ఎదుటివారిపై చూపించే ప్రేమని.. అతని చుట్టూ ఉన్న స్టార్ డమ్ ని మనం అంచనా వేయలేం” అని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ప్రభాస్ గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. దీంతో తమ అభిమాన హీరో గురించి తమన్నా పాజిటివ్ కామెంట్స్ చేసేసరికి డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ప్రెజెంట్ చేతినిండా బిగ్గెస్ట్ మూవీస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, డైరెక్టర్ మారుతీ సినిమాలు బిజీ అయ్యాడు. మరోవైపు తమన్నా భోళాశంకర్, లస్ట్ స్టోరీస్ 2లతో పాటు ఇంకా మరిన్ని సినిమాలు చేస్తోంది. మరి ప్రభాస్ పై తమన్నా కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Prabhas is actually unaware of the Impact he has on People, He doesn’t realise the Stardom he Holds around Himself, He has no clue, I think that’s his Beauty, That’s his Charm! 🥹 ❤️ – @tamannaahspeaks pic.twitter.com/Q0DXV0aio4
— . (@charanvicky_) February 14, 2023