సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య అఫైర్స్ అనేవి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అభిమానులకు కూడా తమ అభిమాన నటుల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున లేడీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేత వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ కోసం చాలామంది హీరోయిన్లు పరితపించేవారు.
ఎంతమంది హీరోయిన్లు నాగ్ జంటగా మారాలని ప్రయత్నించినా స్టార్ హీరోయిన్ టబుతో రిలేషన్ షిప్ మాత్రం స్పెషల్ అంటుంటారు అక్కినేని అభిమానులు. ఆవిడ మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా, సిసింద్రీ సినిమాలలో నాగ్ కి జంటగా నటించిన టబు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగ్ – టబుల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్ బేస్ ఇంకా అలాగే ఉంది.వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగానే నాగ్ – టబు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు బయటికి వచ్చాయి. గతంలో ‘కాఫీ విత్ కరణ్‘ షోలో నాగార్జున గురించి టబు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నాగార్జునతో డేటింగ్ లో ఉన్నారనే పుకార్లపై ఏమంటారు? అని కరణ్ అడిగిన ప్రశ్నకు టబు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
టబు మాట్లాడుతూ.. “ఓహ్! ఈ పుకార్లన్నీ పాతవి. మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోయినా.. వచ్చినా వెళ్లిపోయినా.. నాగార్జున మాత్రం ఉంటారనే మీడియా కథనాలు చూసి ప్రతిసారి ఆశ్చర్యపోతున్నాను. నాకు నాగార్జునతో ఉన్న సంబంధం చాలా ముఖ్యమైనది. తనతో నా అనుబంధం చాలా దగ్గరిది. అలాగే నాగ్ తో నాకున్న బంధాన్ని ఎవరు మార్చరు.. మార్చలేరు. నాగ్ తో ఉన్న అనుబంధాన్ని ఎవరు భర్తీ చేయలేరు” అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం టబు.. భూల్ భులయ్యా, భోలా కుత్తే, కుఫియా, దృశ్యం 2 సీక్వెల్లో నటిస్తోంది. మరి టబు – నాగ్ ల అనుబంధం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.