బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన స్వరా భాస్కర్ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పెళ్లిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలా వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని నిలదీస్తున్నారు.
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అన్నది కొన్ని పెళ్లిళ్లను చూస్తే నిజం అనిపిస్తుంది. బద్ద శత్రువులుగా ఉన్న ఆడ,మగ పెళ్లిళ్లు చేసుకోవటం.. ప్రపంచం ఆ మూలన ఉన్న వాళ్లు.. ఈ మూలన ఉన్న వాళ్లును ప్రేమించటం.. పెళ్లి చేసుకోవటం వంటివి మనల్ని అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెళ్లి కూడా ఆ కోవకే చెందుతుంది. అన్న అని పిలిచిన వ్యక్తిని, వేరే మతానికి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు. సమాజ్ వాది పార్టీకి చెందిన నేత ఫాహద్ జిరార్ అహ్మద్‌ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ఫాహద్తో ఆమెకు పరిచయం అయింది. మొదట్లో ఆమె అతడ్ని ‘అన్నయ్య’ అని పిలిచేది.
తర్వాత ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరే అయినా వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. 2020నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట కోర్టు ద్వారా పెళ్లికి సిద్ధపడింది. తాజాగా, వీరి పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి సంబంధించిన వివరాలను స్వయంగా స్వరా భాస్కరే తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ పెట్టారు. ‘‘ మనం మన పక్కనే ఉన్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. మేము కూడా ప్రేమ కోసం వెతుకుతూ ఉన్నాం.
మొదట స్నేహంగా మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది. నా హృదయం ఫాహద్ జిరార్ అహ్మద్‌కు స్వాగతం’’ అని పేర్కొన్నారు. ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. స్వరా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. గతంలో ఆమె ఫాహద్ జిరార్ అహ్మద్‌ను అన్న అని సంభోదించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అన్న అని పిలిచి, అతడినే పెళ్లి చేసుకోవటానికి సిగ్గులేదా అంటూ మండిపడుతున్నారు. మరి, స్వరా పెళ్లిపై నెటిజన్లు విమర్శలు గుప్పించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm— Swara Bhasker (@ReallySwara) February 16, 2023