తారక్ కోసం ప్రాణానికి ప్రాణమిచ్చే వీరాభిమానులలో శ్యామ్ అనే యువకుడు కూడా ఒకడు. శ్యామ్ అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎలా చనిపోయాడన్న విషయం అనుమానాస్పదంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిన తారక్‌కు.. ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకడు అనుమానాస్పద మృతి చెందాడు. తారక్ కోసం ప్రాణానికి ప్రాణమిచ్చే వీరాభిమానులలో శ్యామ్ అనే యువకుడు కూడా ఒకడు. శ్యామ్ అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎలా చనిపోయాడన్న విషయం అనుమానాస్పదంగా మారింది. ఇక శ్యామ్ మన మధ్యలేడు అన్న విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ సంఘటన అందరిని కలచివేస్తుంది. చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానించే వాడు. ఎక్కడ తారక్ ఈవెంట్ జరిగినా శ్యామ్ అక్కడ ఈవెంట్ పనుల్లో చురుకుగా పాల్గొనేవాడు.
శ్యామ్ మరణవార్త అందరిని విషాదానికి గురి చేస్తుంది. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరైనారు. అదే సమయంలో వేదికపై యంగ్ టైగర్‌తో ఫొటో దిగేందుకు శ్యామ్ ప్రయత్నించాడు. జూనియర్ ఎన్టీఆర్ బాడీ గార్డులు శ్యామ్‌ని పక్కకు నెట్టివేయగా.. ఎన్టీఆర్ పిలిచి శ్యామ్‌తో ఫొటో దిగాడు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. శ్యామ్ మరణంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. శ్యామ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయాన్ని స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వం శ్యామ్ మరణంపై దర్యాప్తు చేయించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి శ్యామ్. అతని సొంత ఊరు తూ.గో. జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. శ్యామ్ కి గంజాయి అలవాటు లేదని.. అయితే శ్యామ్ జేబులోనూ, నోట్లోనూ గంజాయి ప్యాకెట్లు కుక్కారని, చేతిపై కత్తి గాటు కూడా ఉందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. తక్షణమే శ్యామ్ మృతిపై విచారణ జరిపించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. న్యాయం జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
It’s high time we all TFI fans should unite and together fight for the justice 🙏#WeWantJusticeForShyamNTR pic.twitter.com/p46d5YWJJn
— Ashwin Prabhas (@_Prabhasforever) June 26, 2023