సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కుటుంబ సభ్యులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోక వైపు సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా మహిళలకు నమ్రత ఓ విజ్ఞప్తి చేశారు.
నమ్రతా శిరోద్కర్.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణిగా అందరికి సుపరిచితమే. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత, పూర్తిగా కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీ అయిపోయారు. భర్త మహేష్ బాబుతో పాటు, పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది నమ్రత. ఇక నమ్రత సినిమాల్లో నటించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్. తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలానే స్పెషల్ డే సమయాల్లో తన వంతుగా వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా నమ్రత ..మహిళకు ఓ విజ్ఞప్తి చేశారు.
పర్యావరణం పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రరాంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన దాదాపు చాలా మంది సెలబ్రిటీలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ స్వీకరించారు.
మార్చి 8న ఉమెన్స్ డే పురస్కరించుకొని.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలకు నిర్వహించనున్నారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, వివిధ రంగాల్లో మహిళల కృషిని అభినందిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్థికాభివృద్ధిలో వారు పోషిస్తున్న కీలక రోల్ ను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్. అందులో భాగంగానే మహేశ్ బాబు సతీమణి నమ్రత ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు.
ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందూ మొక్కలు నాటాలని నమత్ర విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి… నమ్రత చేసిన విజ్ఞప్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.