టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మహేష్ బాబు తన నటనతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్ తో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచారు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార మనందరికి సుపరిచతమే. తను ఓ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మహేష్ బాబు సితార పట్ల ఎంత ప్రేమ చూపిస్తారో తెలిసిన విషయమే. సితారకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించకపోయినప్పటికి తన డ్యాన్స్ లతో అదరగొడుతుంది. కుటుంబ విషయాల గురించి, తనకు సంబందించిన విషయాల గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఓ యూట్యూబ్ చానల్ ని కూడా రన్ చేస్తోంది. సూపర్ స్టార్ కూతురుగానే కాకుండా తనకున్న ప్రత్యేకమైన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా సితార ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ప్రముఖ జ్యువెల్లరీ షాప్ తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకుంది. దీని కోసం సితారకు భారీ మొత్తంలో పారితోషకాన్ని ముట్టజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన స్టార్ కిడ్ గా నిలిచింది. ఆ జ్యువెల్లరీ సంస్ధ నగలకు సంబందించిన యాడ్స్ కోసం సితారతో ఇటీవలె షూటింగ్ కూడా చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కానుందని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ కూతురుగా సితార బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తుందని మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.