సూపర్ స్టార్ మహేష్ బాబు చాలారోజుల తర్వాత ఓ పెళ్లిలో సందడి చేశాడు. సింపుల్ గా కనిపించినప్పటికీ.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పెళ్లిలో సందడి చేశాడు. సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్న మహేష్.. సింపుల్ గా కనిపించినప్పటికీ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. ఇలాంటి టైంలో మహేష్.. ఒక్క ఫొటోతో ట్రెండింగ్ లోకి వచ్చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇంతకీ ఎవరి పెళ్లిలో మహేష్ సందడి చేశాడు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు ఎక్కడైనా సరే సింపుల్ గా కనిపిస్తారు. సినిమాల్లో కాస్త కలర్ ఫుల్ డ్రస్సులతో దర్శనమిస్తారు కానీ బయటమాత్రం చాలా నార్మల్ గా కనిపిస్తూనే వైరల్ అవుతుంటారు. అలా హైదరాబాద్ లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ కామేశ్వరరావు కొడుకు పెళ్లికి వెళ్లిన మహేష్.. వైట్ షర్ట్-బ్లూ జీన్స్ లో కనిపించారు. రెడ్ డ్రస్సులో కనిపించిన నమ్రతా మహేష్ కు తగ్గట్లే ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇదిలా ఉండగా మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళితో కలిసి పనిచేస్తారు. సరే ఇదంతా పక్కనబెడితే.. పెళ్లిలో మహేష్ బాబు లుక్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.