సినీ సెలబ్రిటీలు షూటింగ్స్ సమయాలలో గాయపడటం గురించి రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. ప్రమాదం అని చెప్పి.. ఎలాంటి ఫిజికల్ డామేజ్ కాకుండా సినిమాలు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ.. షూటింగ్స్ లో నటీనటులు ప్రమాదానికి గురై గాయపడ్డారు అని తెలిస్తే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఫ్యాన్స్ ఇలాంటి టెన్షన్ లోనే పడ్డారు. ఇటీవల ఓ షూటింగ్ సెట్ లో గాయపడిన సన్నీ.. తన గాయానికి సంబంధించి వీడియో షేర్ చేసింది. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేదు. కానీ.. వీడియో చూస్తుంటే.. సన్నీ కాలి బొటనవేలికి గాయమై రక్తం రావడం వీడియోలో చూడవచ్చు.
సినిమా షూటింగ్స్ లో ఇవన్నీ మామూలే అయినప్పటికీ.. సన్నీ ఎప్పుడూ ఇలాంటి గాయాలను ఫేస్ చేయలేదని వీడియోలో వాపోయింది. పైగా ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు నొప్పి భరించలేక అరవడం కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం సన్నీ ఫ్యాన్స్ ఈ వార్త తెలిసి షాక్ అవుతున్నారు. ప్రెజెంట్ సన్నీ చేతినిండా సినిమాలతో బిజీగా మారింది. మరి ఈ గాయం ఏ సినిమా షూటింగ్ లో జరిగిందో గానీ.. సన్నీ గెటప్ చూస్తుంటే డీ-గ్లామర్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సన్నీ గతేడాది మంచు విష్ణు సరసన ‘జిన్నా’ మూవీలో మెరిసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ.. సన్నీకి మంచి పేరుతో పాటు అవకాశాలు కూడా రాబట్టిందట.
ఇదిలా ఉండగా.. సన్నీ ఫిలిం కెరీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డేనియల్ వెబర్ ని పెళ్లాడాక పూర్తిగా ఇండియన్ సినిమాలకే పరిమితమైంది. ఇప్పటిదాకా రొమాంటిక్ మూవీస్ ఎక్కువగా చేసిన సన్నీ.. ఈ మధ్య పంథా మార్చి క్యారెక్టర్స్ పరంగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు సన్నీ చేతిలో తెలుగు సినిమాలైతే లేవు. కానీ.. రంగీలా అనే మూవీతో మలయాళంలో డెబ్యూ చేయనుంది. అలాగే తమిళంలో రెండు సినిమాలతో పాటు హిందీలో నాలుగు సినిమాలను లైనప్ చేసింది. మరి 2023లో బిగ్ స్క్రీన్ పై సన్నీ.. తనను తాను నటిగా ఆవిష్కరించుకోనుందేమో చూడాలి. మరి సన్నీ లియోన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.