సన్నీలియోన్.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ ఇండస్ట్రీల్లో చాలా బిజీగా గడుపుతోంది. ఒకప్పుడు స్పషల్ సాంగ్స్ తో సరిపెట్టుకున్న సన్నీ.. ప్రస్తుతం లీడ్ రోల్స్ కూడా చేస్తోంది. అంతేకాకుండా మలయాళం ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టబోతోంది. అన్ని భాషల్లో కలిపి సన్నీ లియోన్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాల వరకూ ఉన్నాయి. తెలుగులోనూ మంచు విష్ణుతూ కలిసి గాలి నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచు విష్ణుకు, సన్నీలియోన్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వారిద్దరు కలిసి కొన్ని ఫన్నీ వీడియో సైతం చేశారు. తాజాగా మంచు విష్ణుకు గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో మంచు విష్ణుతో కలిపి ప్రాంకులు చేయడం, వంట చేయడం చేస్తూ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి కూడా ఆ మూవీకి ఒకరకంగా ప్రమోషన్స్ గానే చెప్పొచ్చు. అయితే ప్రాంకులు, డాన్సులు అన్ని అయిపోయాకి ఇప్పుడు సన్నీ వైద్యురాలి అవతారం ఎత్తింది. మంచు విష్ణు.. గాలి నాగేశ్వరరావు పాత్రలో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఆ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కి జోడిగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటి రేణుక పాత్రలో సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఈక్రమంలో సన్నీ లియోన్ ”ఓయ్ గాలి నాగేశ్వరరావు, చాలా రోజుల నుంచి కనిపించడం లేదు” అని ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: అందరికి నయనతార తెలుసు. కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న ఈ విగ్నేష్ శివన్ ఎవరు?
దానిని కోట్ చేసిన పాయల్ ‘ఇంకెన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్’ అని విష్ణు మంచును అడిగారు. రేపు ఉదయం చెబుతానని విష్ణు సమాధానం ఇచ్చారు. వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ స్టారైనా సన్నీలియోన్ మంచుకు విష్ణుకు ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య ఉన్న మంచి స్నేహానికి ఈ ట్వీట్ నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సన్నీలియోన్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Oyee! Gali Nageswara Rao @iVishnuManchu
Long Time No See! 😈 😈— Sunny Leone (@SunnyLeone) June 9, 2022