ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శక ధీరుడు రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. RRR సినిమాతో ఆయన పేరు మరో ఎత్తుకు చేరుకుంది. బాహుబలికి మించిన టాక్ RRR సొంతం చేసుకుంది. సినిమా విడుదల అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నటన పరంగా రామ్ చరణ్- తారక్ అభిమానులను కట్టి పడేశారు. ఇద్దరు స్టార్ హీరోలు తెరపై ఉంటే.. తెర వెనుక ఉన్న స్టార్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే వాటన్నింటిలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ రియాక్షన్ వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: తెరమీదకు RRR 2.. జక్కన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా..?
‘మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు. మేము చూడగలం అంతే’ అంటూ సుకుమార్ RRR సినిమా గురించి, రాజమౌళి దర్శకత్వం గురించి రివ్యూ ఇచ్చేశారు. సుకుమార్ రీసెంట్ హిట్ పుష్ప సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అంతటి డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది కదా రాజమౌళి అంటే అంటూ కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.