తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బుల్లితెర స్టార్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకొని ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బుల్లితెర పై తనదైన శైలిలో డాన్స్, కామెడీతో అలరించే సుధీర్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ భీభత్సంగా సంపాదించుకున్నాడు. అడపాదడపా వేరే హీరోల సినిమాలలో మెరిసే సుధీర్.. హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’.
సుధీర్, డాలీ షా హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను అరుణ్ విక్కీరాల తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లాంచ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా కనిపిస్తున్నాడు. చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా.. మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్లు పోవడం’ అనే డైలాగ్‌తో టీజర్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ బ్యానర్స్ పై విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి సినిమాను నిర్మిస్తున్నారు. మరి ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి సుధీర్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.