తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బుల్లితెర స్టార్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకొని ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బుల్లితెర పై తనదైన శైలిలో డాన్స్, కామెడీతో అలరించే సుధీర్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ భీభత్సంగా సంపాదించుకున్నాడు. అడపాదడపా వేరే హీరోల సినిమాలలో మెరిసే సుధీర్.. హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. సుధీర్, డాలీ షా హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను అరుణ్ విక్కీరాల తెరకెక్కిస్తున్నాడు. […]