Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై క్రేజీ స్టార్డమ్తో దూసుకుపోతున్నారు సుడిగాలి సుధీర్. నటుడిగా, యాంకర్‌గా, మెజీషియన్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. మ్యాజిక్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు. ‘‘సాఫ్ట్వేర్ సుధీర్’’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘గాలోడు, కాలింగ్ సహస్త్ర’ సినిమాలు చేస్తున్నారు. సుధీర్ ఇటు బుల్లితెరపై కూడా ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికంటూ తగినంత టైం కేటాయిస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడుపుతుంటారు.
సుధీర్‌కు ఓ అక్క, తమ్ముడు రోహాన్ ఉన్నారు. రోహాన్‌కు రమ్య అనే యువతితో ఇదివరకే పెళ్లయింది. తాజాగా, రోహాన్ దంపతుల జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది బాబునా.. లేక పాపనా అన్నది తెలియరాలేదు. తమ్ముడు తండ్రి కావటంతో సుధీర్ పెదనాన్న అయిపోయారు. ఈ నేపథ్యంలో సుధీర్ ఇంట సంబరాలు జరుగుతున్నాయి. కాగా, కొద్దిరోజుల క్రితం జరిగిన రోహాన్ భార్య రమ్య సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సీమంతం ఫంక్షన్‌కు సుధీర్ ప్రాణ స్నేహితుడైన గెటప్ శ్రీను కూడా హాజరయ్యాడు. మరి, సుడిగాలి సుధీర్ పెదనాన్న కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sudigali Sudheer: మరో సారి స్టేజీ మీద సుధీర్ లవ్ బ్రేకప్ స్టోరి..!