Sara Ali Khan – Janhvi Kapoor: మోస్ట్ పాపులర్ బాలీవుడ్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో ఒకటి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు పాల్గొని తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఇప్పటి వరకూ ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో 7వ సీజన్ లోకి ఇటీవలే అడుగుపెట్టింది. మొదటి ఎపిసోడ్ లో రన్వీర్ సింగ్, అలియా భట్ అలరించగా.. రెండవ ఎపిసోడ్ లో బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు సందడి చేశారు. వీరిద్దరూ పాల్గొన్న రెండవ ఎపిసోడ్ కి సంబంధించి వీడియో తాజాగా రిలీజయింది. ఈ ఎపిసోడ్ లో సారా, జాన్వీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు హోస్ట్ కరణ్ జోహార్.
సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు ఇద్దరు అన్నదమ్ములతో డేటింగ్ చేస్తున్నట్టు కరణ్ జోహార్ వెల్లడించాడు. దీనికి షాకైన ఈ బ్యూటీలు ‘ఇంత ఓపెన్ గా మా విషయం బయటపెడతావా?’ అంటూ కరణ్ ని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా కరణ్.. ఆ అన్నదమ్ములతో వీళ్ళకి లాక్ డౌన్ సమయంలో ఫ్రెండ్ షిప్ కుదిరిందని, ఆ సమయంలో ఆ సోదరులిద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండేవాళ్లని వారి రహస్యాలను బయటపెట్టాడు. దీంతో కరణ్ చెప్పినవి నిజమే అని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే నడుస్తోంది.
సారా, జాన్వీతో డేటింగ్ చేసిన ఆ లక్కీ బ్రదర్స్ వీళ్ళే అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. సారాతో వీర్ పహారియా, జాన్వీతో శిఖర్ పహారియా డేటింగ్ లో ఉన్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వారు కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీర్, శిఖర్ సోదరులిద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు కావడంతో ఈ వార్త మరింత జోరందుకుంది. బ్రదర్స్ తో డేటింగ్ చేస్తున్న హీరోయిన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్ హత్యకు కుట్ర! పోలీసుల విచారణలో నిందితుడు బయటపెట్టిన నిజాలు!