సాధారణంగా చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీట్ కాంబినేషన్ లో చిత్రం వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. మరి అలాంటిది.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్-ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే.. ఈ ఊహకే బాక్సాఫీస్ లు బద్దలు అవ్వడం ఖాయం. అవును రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-ప్రభాస్ లు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరితో కలిపి రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
SS రాజమౌళి.. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. ఆయన దర్శకత్వంలో ఒక్కటంటే ఒక్కటి.. సినిమా చెయ్యాలని చాలా మంది హీరోలు చూస్తుంటారు. ఇక ప్రస్తుతం జక్కన్న RRRకు సంబంధించిన ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎలాగైనా ఈ సారి ఇండియాకు ఆస్కార్ తెప్పించాలని కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే హీరో ప్రభాస్-ఎన్టీఆర్ లు హీరోగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు పరిశ్రమలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్ ను కలిపి RRR తెరకెక్కించిన జక్కన్నకు.. ఎన్టీఆర్ ప్రభాస్ లను కలిపి మరో చిత్రాన్ని తెరకెక్కించడం పెద్ద లెక్క కాదంటున్నారు అభిమానులు.
పైగా ప్రభాస్ కు, ఎన్టీఆర్ కు రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి మనందరికి తెలిసిందే. ఈ అనుబంధంతోనే వీరితో మల్టీస్టారర్ కు ప్లాన్ చేసినట్లు పరిశ్రమ వర్గాల్లో వినికిడి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ముగ్గురు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ మూవీలతో బిజీగా ఉన్నాడు. ఇక దర్శక దిగ్గజం రాజమౌళి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వెంచరల్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. కథను కూడా తన తండ్రితో సిద్దం చేయిస్తున్నారు. వీరి సినిమాలు పూర్తైతేగానీ ఎన్టీఆర్-ప్రభాస్ మల్టీస్టారర్ మూవీపై క్లారిటీ రాదు.