Srikanth Reddy: కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం అంతకంతకూ పెరుగుతూపోతోంది. శ్రీకాంత్ రెడ్డి ఛానల్ మూసేసి, మోకాళ్లపై కూర్చుని ఆడవాళ్లందరికి క్షమాపణ చెప్పేవరకు తాను వదలిపెట్టనని కళ్యాణి సపథం పూనారు. శ్రీకాంత్‌తో పాటు మరికొంత మంది బూతు యూట్యూబర్‌ల ఛానల్‌లు మూసేయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసుకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తనకు కరాటే కళ్యాణినుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్ మేయిలింగ్ కేసు పెట్టాడు. అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ.. తనకు కరాటే కళ్యాణినినుంచి ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే ఆమెదే బాధ్యతని అన్నారు. ఆమెపై అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్ మేయిలింగ్ కేసులు పెట్టినట్లు తెలిపారు.
కళ్యాణితో గతంలో తనకు ఎలాంటి గొడవలు లేవని, నిన్నే మొదటిసారి ఆమెను కలిశానని చెప్పాడు. తన ఇంటి దగ్గరకు వచ్చి, గొడవ పెట్టుకుందన్నాడు. తనపై దాడి చేయటంతోటే తాను కూడా దాడి చేశానని అన్నాడు. ఆమె తనను లక్ష రూపాయలు డబ్బులు అడిగిందని, డబ్బులు ఇవ్వనని చెప్పటంతోటే ఇవన్నీ జరిగాయని ఆరోపించాడు. కరాటే కళ్యాణి కూడా బాబి లాంటివి చేయలేదా అని ప్రశ్నించాడు. సినిమాల్లో ఊ అంటావా.. ఊఊ అంటావా?.. ఆసిక్ బాన్ ఆయా అన్న పాటలు ఉంటే తప్పులేదు కానీ.. నేను మాత్రం వీడియోలు చేస్తే తప్పా అని ప్రశ్నించాడు. తాను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు మాత్రమే చేస్తానని చెప్పాడు. జూనియర్ ఆర్టిస్టులతో పేయిడ్ వీడియోలు చేస్తానని, తాను కూడా ఓ ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశ్యంతోనే చేస్తున్నానని అన్నాడు.
కాగా, కరాటే కళ్యాణి గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లింది. ప్రాంక్ వీడియోలపై అతన్ని నిలదీసింది. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతని చెంపపై కొట్టింది. అనంతరం ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టాడు. దీంతో గొడవ పెద్దదైంది. తిరగబడ్డ శ్రీకాంత్ రెడ్డి తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి చెంప పగలకొట్టాడు. ఈ ఘర్షణలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి.. విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి, గుడ్డలూడదీసి మరీ కొట్టింది. అంతేకాదు! ల***కొడుకా!.. అంటూ ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది. మరి, శ్రీకాంత్ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karate Kalyani: వైరల్ గా మారిన కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి రచ్చ! తప్పు ఎవరిది?