హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. ఒక ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ కు టాలీవుడ్ లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి. తర్వాత సపోర్టింగ్ రోల్స్, విలన్ గానూ చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కన్నడలోనూ హీరో శ్రీకాంత్ కు ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలతో శ్రీకాంత్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో శ్రీకాంత్ కి జోడీ అంటే అందరికీ బాగా గుర్తొచ్చే పేరు రోజా. రోజా- శ్రీకాంత్ కలిసి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలను అందించారు.
శ్రీకాంత్- రోజా కాంబినేషన్ లో వచ్చిన క్షేమంగావెళ్లి లాభంగా రండి, ఘటోత్కచుడు, తిరుమల తిరుపతి వెంకటేశ అనే సినిమాల్లో వీరి కాంబోకి చాలా మంది ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి ముచ్చటపడిపోయారు. బయట కూడా వీరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. రోజా ఎప్పుడూ శ్రీకాంత్ ని అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో అభిమానం చూపించేది. అయితే ఆ అభిమానమే ఒక్కోసారి శ్రీకాంత్ కు కోపం తెప్పించేదట.
అవును.. అన్నయ్య అని పిలిస్తే కోపం దేనికి అనుకుంటున్నారా? అందుకు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. రోజాతో చేసిన సినిమాల గురించి గుర్తుచేసుకున్న సందర్భంలో ఈ కామెంట్స్ చేశాడు. రోజా ఎప్పుడు తనని అన్నయ్యా అని పిలిచేదని చెప్పారు. సెట్స్ లో ఎప్పుడు చూసినా అన్నయ్య అంటూనే ఉండేదట. అయితే రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో కూడా అన్నయ్యా అంటూ పిలిస్తే శ్రీకాంత్ కు బాగా కోపం వచ్చేదట. రొమాంటిక్ సీన్స్ అప్పుడు అన్నయ్యా అంటే తనకు ఇబ్బందిగా ఉందని కూడా చెప్పాడట.
కానీ, రోజా అన్నయ్యా అని పిలవడంతో చిర్రెత్తుకొచ్చి.. ఎహే అలా పిలవకు రొమాంటిక్ సీన్ లో నాకు చిరాకుగా ఉందని చెప్పేశాడట. ఇంక సినిమాల విషయానికి వస్తే.. శ్రీకాంత్ కొడుకు కూడా హీరోగా పరిచయం అయిపోయాడు. ఇటీవలే పెళ్లిసందD సినిమాతో హిట్టు కొట్టాడు. తర్వాత ప్రాజెక్టు కూడా పట్టాలెక్కేసింది. శ్రీకాంత్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో ఎన్నో ప్రయోగాలు చేసిన శ్రీకాంత్ నుంచి.. మరిన్ని మంచి సినిమాలను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అభిమానులను ఎప్పుడూ తన నటనతో అలరిస్తానంటూ శ్రీకాంత్ కూడా హామీ ఇస్తున్నారు.