Sree Nithi: ఆడవాళ్లలోని ప్రతిభకు క్యాస్టింగ్ కౌచ్ బూతం అడ్డంకిగా తయారయ్యింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది నటీమణుల జీవితాలు నాశనం అయ్యాయి. కామాంధుల కోర్కెలు తీర్చలేక, సినిమా పరిశ్రమనుంచి తప్పుకున్న వారు చాలా మందే ఉన్నారు. మరికొంతమంది దాన్ని ధైర్యంగా ప్రశ్నించి అవకాశాలకు దూరమయ్యారు. అవకాశం దొరికినపుడు లేదా సందర్భం వచ్చినపుడు తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతూ ఉన్నారు. హాలీవుడ్‌తో మొదలైన మీటూ ఉద్యమం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో ఉద్యమంలా దూసుకెళ్లింది. ఎవ్వరికీ బయపడకుండా చాలా మంది తమపై జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు.. బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా, ప్రముఖ తమిళ బుల్లితెర నటి శ్రీనిధి తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. నేనో మలయాళం సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్‌లకు నా వెంట అమ్మ వచ్చేది.
సినిమాకు సంబంధించిన కొంతమంది మాతో ‘మీరు అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాలి’ అని అన్నారు. మా అమ్మ అప్పుడు ‘అడ్జస్ట్మెంటే కదా అవుతాము.. టీ, ఫుడ్డు, రూము ఇలా అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతాము. మాది అడ్జస్ట్ అయ్యే ఫ్యామిలీనే’ అన్నది. కానీ వాళ్లు ‘ మేడమ్! మేము అంటున్నది ఆ అడ్జస్ట్ కాదు.. అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం’ అన్నారు. మా అమ్మకు అర్థం కాలేదు. వాళ్లు అర్థమయ్యేలా చెప్పారు. మా అమ్మ వెంటనే ‘ సారీ సార్! మాది అలాంటి కుటుంబం కాదు’ అని అన్నారు. మేము అక్కడినుంచి వెళ్లిపోతుంటే ‘కూతురే కావాలనేమీ లేదు.. తల్లి వచ్చినా ఒకే’ అన్నారు.’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మరి, శ్రీనిధి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jr.Ntr ఇంటి ముందు అర్థరాత్రి ఉద్రిక్తత.. అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్!