తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడ్రోజుల క్రితం మలేషియాలో బిచ్చగాడు షూటింగ్ చేస్తున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో విజయ్ ఉన్న బోటు ఎదురుగా బోటును ఢీకొట్టింది. అప్పుడు విజయ్ ఆంటోని పైకి ఎగిరి కింద పడటంతో గాయాలయ్యాయి. ఆయన ముఖం, దవడకు గాయాలయ్యాయని, పళ్లు కూడా విరిగాయంటూ ఆయన సతీమణి ఫాతిమా తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
బుధవారం సాయంత్రమే విజయ్ ఆంటోనీని మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చారు. విజయ్ ఆంటోనీ ఆరోగ్యం బాగానే ఉందని.. సినిమా పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే.. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే కోమాలోకి వెళ్లారంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకొందరు ఆయన బాగానే ఉన్నారు. కానీ, ప్లాస్టిక్ సర్జరీ చేసారంటూ చెప్తున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. నిన్నటి వరకు విజయ్ ఆంటోనీ బాగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడు కోమాలోకి వెళ్లాడని చెప్తుండటంతో అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
విజయ్ ఆంటోని కోలుకుని క్షేమంగా తిరిగి రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు. విజయ్ ఆంటోనీ చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. కొన్ని సొంత ప్రాజెక్టులు కాగా.. కొన్ని వేరే నిర్మాతలు, దర్శకులు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా షూటింగ్ డిలే కావడమే కాకుండా.. మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బిచ్చగాడు 2 మొదలుకుని.. కొలై, రథం, మజై పిడికత మనితన్, వల్లి మాయల్ వంటి సినిమాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లాడంటూ వస్తున్న వార్తలు విని టు తెలుగు ఫ్యాన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.