సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్’. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు రజినీ కూడా ఆశలు పెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా హిట్ లేక రేసులో వెనుక బడిపోయారాయన. వరుస ప్లాపులతో శతమతమవుతున్నారు. ‘జైలర్’ సినిమాతో హిట్టు కొట్టి, తానూ రేసులో ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నెల్సన్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పారు.
సినిమా అవుట్ పుట్ బాగా రావటం కోసం ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్సన్ అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించేలా ప్లాన్‌ను చేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఆయా భాషలకు చెందిన స్టార్లను సినిమాలో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో వార్త సినిమా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ జైలర్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయనున్నారట. జనవరి 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం.
చెన్నైలో ఈ షూటింగ్ ఉండనుందని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలో ఎటువంటి అఫిషియల్ కన్‌ఫర్మేషన్ లేదు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే సినిమా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా భాటియా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, వాసంత్ రవి, వినాయకన్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, జైలర్ సినిమాలో మోహన్ లాల్ గెస్ట్ పాత్ర చేయనున్నారనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
As per rumours making the round in Kerala,@Mohanlal will do a cameo in #SuperstarRajinikanth’s #Jailer.
No official confirmation so far! #Jailer @rajinikanth #Mohanlal pic.twitter.com/F8lLQsJE94— Sreedhar Pillai (@sri50) January 6, 2023