రీల్ యాక్టర్ కం రియల్ హీరో.. సోనూసూద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకాదరణ పొందిన సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్ హీరో అయిపోయాడు. అప్పటినుండి సోనూసూద్ ని విలన్ గా చూసేందుకు అభిమానుల మనసు ఒప్పుకోవడం లేదని అంటున్నారు.
ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. సోనూసూద్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికి తెలిసిందే. విలన్ గా వెండితెర మీద అలరిస్తున్న సోనూ.. త్వరలోనే టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ‘MTV Roadies’లో హోస్ట్ గా సోనూసూద్ ఎంపికైనట్లు షో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. గత 18 సీజన్స్ నుండి హోస్ట్ గా, జడ్జిగా వ్యవహరించిన VJ రణ్విజయ్ సింఘా తదుపరి సీజన్ నుండి షోలో కనిపించనని తెలిపాడు.తాజాగా సోనూసూద్ మాట్లాడుతూ.. ఈ ‘MTV Roadies’ రియాలిటీ షోలో భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతి సీజన్ లోను అదిరిపోయే ట్విస్టులు, సాహసాలతో షో ప్రేక్షకులకు అడ్వెంచర్ థ్రిల్ చూపించింది. ఈ రియాలిటీ షో మన శారీరక, మానసిక, భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఆ విషయమే నన్ను షోని హోస్ట్ చేసేందుకు కారణమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక MTV ఇండియా ఛానల్ లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ షూటింగ్ ఫిబ్రవరి 2వ వారం దక్షిణాఫ్రికాలో ప్రారంభమవుతుందని యాజమాన్యం తెలిపింది. మరి యాక్టర్ కం హోస్ట్ సోనూసూద్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.