గత ఆరు సీజన్ లుగా అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో తాజాగా 7 సీజన్ కి సిద్ధమవుతుంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మేకర్స్ ఈ సారి ఒక తెలుగు క్రికెటర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.
బిగ్ బాస్ వస్తుందంటే చాలు బులి తెర అభిమానులు పండగ చేసుకుంటారు. వరల్డ్ లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ఒక ట్రెండ్ క్రియేట్ చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. ఆరు సీజన్ లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా 7 సీజన్ కి సిద్ధమవుతుంది. సీజన్ 6 అంతగా ఆకట్టులేకపోవడంతో ఈ సారి బిగ్ బాస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవలే ప్రోమోతో సీజన్ 7 ఉండబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రియాలిటీ షో పైన పడింది. ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షో కి భారత మాజీ క్రికెటర్ వేణు గోపాలరావు ని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ కి ప్రధాన ఆకర్షణ కంటెస్టెంట్లు. సీజన్ ఎప్పుడు ప్రారంభమైన హౌస్ లోకి ఎవరు వస్తారు అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. మేకర్స్ కూడా ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్లని తెచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను అభిమానులకి పరిచయం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే హౌస్ లోకి వచ్చేవారు ఎవరో ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా మాజీ క్రికెటర్ వేణు గోపాలరావుని ఈ షో కి తీసుకువచ్చెనందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇండియన్ క్రికెట్ టీం తరుపున చోటు సంపాదించుకున్న అతి తక్కువ తెలుగు క్రికెటర్లలో వేణు కూడా ఒకడు. ఆడింది తక్కువ మ్యాచులే అయిన్పటికీ ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉంటున్న ఈ క్రికెటర్ బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
మొదటి 5 సీజన్లలో మంచి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ షో గతేడాది జరిగిన ఆరవ సీజన్ లో పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఈ సారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేలా సీజన్ 7 ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా క్రికెటర్ వేణు గోపాలరావు ని తెచ్చి షో కి ఒక కళ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇన్ని రోజులు ప్రేక్షకులు ఆయనని ఒక ఆటగాడిగా మాత్రమే చూసిన వారు ఒకవేళ ఈ హౌస్ లోకి అడుగు పెడితే ఎలా ఉంటాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఒకవేళ అదే జరిగితే తెలుగు బిగ్ బాస్ లోకి తొలిసారి ఒక క్రికేటర్ ని మనం చూడబోతున్నాం. ఇప్పటికే బుల్లి తెర సూపర్ స్టార్ ప్రభాకర్, విడాకులు తీసుకున్న ఒక జంట కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఊహించినట్లుగా వేణు గోపాల్ రావు హౌస్ లోకి వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.