బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్, తన భార్య సీమా ఖాన్ నుంచి విడాకులు తీసుకోబోతున్న వార్తలు ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. నటుడిగా, నిర్మాతగా సోహైల్ ఖాన్ కొన్ని సినిమాలు చేశారు. ఆయన భార్య సీమా ఖాన్ కూడా బాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సోహైల్ – సీమా ఇద్దరూ 1998లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు పెళ్ళైన 24 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
వీరికి నిర్వాణ్, యోహాన్ అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా సోహైల్ – సీమా వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరూ ముంబై కోర్టు పరిసర ప్రాంతాల్లో కనిపించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇద్దరు కూడా కొంతకాలంగా ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడివిడిగానే ఉంటున్నారట.
ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టుకు హహాజరైనట్లు సమాచారం. వీరి విడాకులపై కోర్టు స్పందించి.. ‘సోహైల్ ఖాన్, సీమా సచ్‌దేవ్ ఇద్దరూ కోర్టుకు హాజరై విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని. విడాకుల విషయంలో ఇద్దరూ సుముఖంగా ఉన్నట్లు తెలిపిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ మూవీ టైంలో సోహైల్ – సీమా సచ్ దేవ్ ను కలిశారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి 1988లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల వార్త సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.