టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఓ సక్సెస్ఫుల్ హీరో స్థాయికి చేరారు శివకార్తికేయన్. ప్రజలకు నచ్చే సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ‘డాక్టర్’ సినిమాతో ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శివకార్తికేయన్.. తాజాగా, ‘డాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడిగా చాలా మందికి లైఫ్ ఇచ్చిన శివ, ఈ సారి అట్లీ అసిస్టెంట్ శిబి చక్రవర్తిని డైరెక్టర్‌గా పరిచయం చేశారు. మే 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి మంచి రివ్యూలను సైతం దక్కించుకుంది. తండ్రి, ప్రొఫెసర్‌పై కోపం, కలను సాకారం చేసుకోవాలనే పట్టుదల ఉన్న యువకుడిగా శివకార్తికేయన్ నటన మెప్పిస్తుంది. తండ్రిగా సముద్రఖని, కాలేజ్ ప్రొఫెసర్‌గా ఎస్జే సూర్య, హీరో స్నేహితురాలు, ప్రియురాలిగా ప్రియాంక అరుల్ మోహన్ల నటన ఆకట్టుకుంటుంది.
మిగిలిన వారు వారి పరిథికి తగ్గట్టు అద్భుతంగా నటించారు. కథ కొత్తదేమీ కాకపోయినా పాత కథతోనే ప్రేక్షకుల్ని మెప్పించటంలో రచయితగా, దర్శకుడిగా శిభి సక్సెస్ సాధించారు. కామెడీతో జనాల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. అంతేకాదు! బలవంతపు చదువులపై తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇవ్వటంతో పాటు కంటనీరు పెట్టించారు. సంగీత దర్శకుడిగా అనిరుథ్ ఎప్పటిలాగే సూపర్ హిట్ అనిపించుకున్నారు. పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోతుంది. చివరి 30 నిమిషాల భాగం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఎమోషనల్‌గా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మొత్తానికి మన కాలేజ్ డాన్ అదరగొట్టాడు.
ప్లస్ పాయింట్స్
ఇవి కూడా చదవండి : Karate Kalyani: కరాటే కళ్యాణి ఇంట్లో పోలీసుల సోదాలు.. ఆ ఇద్దరు చిన్నారులు ఎవరు!