సిరివెన్నెల సీతారామశాస్ర్తీ మరణం తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదాని నింపింది. అనార్యోగ కారణంగా గత కొంతకాలంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించి బుధవారం మరణించారు. ఆయన మరణం పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిజేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన సహకారం పట్ల సిరివెన్నెల కుటుంబం మాట్లాడారు. తమ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
” మంగళ వారం ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేసి నాన్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి ఖర్చులను చెల్లించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. నాన్న మృతి చెందినప్పుడు సీఎం సంతాపం తెలిపారు. నాన్న అంత్యక్రియల ఏపీ మంత్రి పేర్నినాని హజరై… ఖర్చులనీ ప్రభుత్వమే భరిస్తుందనీ..మేము కట్టిన డబ్బులను వెనక్కు తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.
సిరివెన్నెల పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా ఉండి, భరోసా ఇచ్చిన సీఎం జగన్ కు మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోందని” సిరివెన్నెల కుమారుడు యోగేశ్వర్ తెలిపారు. సీఎం సహాయ నిధి నుంచి వైద్యఖర్చుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపట్టారు అధికారు. మరియు సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించినట్లు అధికారుల వెల్లడించారు. సిరివెన్నెల కుటుంబ పట్ల ఏపీ సీఎం జగన్ నిర్ణాయలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.