ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె 78 ఏళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వాణీ జయరాం మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. కాగా, వాణీ జయరాం తమిళనాడులోని వేళ్లూరులో జన్మించారు. ఆమె అసలు పేరు కళైవాణి. చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 1971లో సినిమా రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ సింగర్‌గా కొనసాగారు. 1969లో జయరామ్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. 2018లో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోనే ఉంటున్నారు.
ఇక, తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కే విశ్వనాథ్, జమున, శ్రీనివాసమూర్తి వంటి సినీ ప్రముఖులు కన్నుమూశారు. గురువారం రాత్రి తెలుగు దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ మరణించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతిపై సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తదితరులు విశ్వనాథ్ భౌతిక దేహాన్ని దర్శించుకుని, నివాళులు అర్పించారు. నిన్న సాయంత్రం విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరి, ప్రముఖ సింగర్ వాణీ జయరాం మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Veteran singer and PadmaBhushan recipient Vani Jayaram (77) garu is no more!
ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం (77) కన్నుమూత
చెన్నైలో తుదిశ్వాస విడిచిన గాయనీమణి
ఇటీవల ఆమెకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటన
దక్షిణాది భాషల్లో 10 వేల పాటలు పాడిన వాణీ జయరామ్Om Shanthi 🙏 pic.twitter.com/jUIJ8U9xpP
— idlebrain jeevi (@idlebrainjeevi) February 4, 2023