సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో మోస్ట్ పాపులర్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆమె తన భర్తను గట్టిగా హగ్ చేసుకున్న వీడియో ఒకటి అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇద్దరి మధ్య గాలి దూరే గ్యాప్ లేనంత దగ్గరగా దంపతులిద్దరూ గట్టిగా కౌగలించుకుని, చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోకి.. ఓ మ్యూజిక్ ట్రాక్ ను యాడ్ చేసి వీడియోను బయటకి వదిలారు. సిటీలైట్స్ అనే బాలీవుడ్ మూవీలోని “ముస్కురానే కి వజహ్ తుమ్ హో” అనే పాటలోని మొదటి పల్లవిని జోడించి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు సునీత. దాని అర్ధం “నా మొఖంలో చిరునవ్వుకు కారణం నీవే” అని. అంటే తన సంతోషానికి కారణం ఆమె భర్త అని ఆమె ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.
ఈ ముచ్చటైన జంటని చూసిన అభిమానులు.. ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కొందరు వారి పెళ్ళి రోజు అనుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సునీత, రామకృష్ణ వీరపనేని అనే బిజినెస్ మేన్ ల వివాహం 2021 జనవరి 9న జరిగిన సంగతి తెలిసిందే. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనిని పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు సునీత. ఈ విషయం ఆమెను చూస్తేనే తెలుస్తోంది. మరి ఈ చూడ ముచ్చటైన జంటను చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: నేను గే ని కాదు.. కానీ ఆ హీరోని ముద్దు పెట్టుకోవాలని ఉంది: RGV