సింగర్ సునీత అనగానే అద్భుతమైన మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 1995లో ‘గులాబి’ సినిమాలో పాట పాడి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పటికీ వందలాది సాంగ్స్ ని తన గొంతుతో ప్రాణం పోశారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చాలామంది హీరోయిన్ల పాత్రలకు జీవం పోసింది. ప్రస్తుతం కెరీర్ ని చూసుకుంటూనే.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆస్వాదిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఓ సంఘటన జరిగిన దగ్గర నుంచి కన్నీళ్లు రావడం లేదని చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు చిత్రసీమకు సొంతమైన అద్భుతమైన సింగర్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఆయన గానమాధుర్యంతో సంగీత ప్రియుల్ని ఓలలాడించారు. కానీ కరోనాతో పోరాడుతూ 2020 సెప్టెంబరులో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ పాటల రూపంలో ఇంకా బతికే ఉన్నారు. అయితే తాజాగా ఆయనని మరోసారి గుర్తుచేసుకున్న సింగర్ సునీత.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. తన లైఫ్ లో వచ్చిన మార్పు గురించి కూడా చెప్పుకొచ్చింది.
‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. అంతకు మించి గుండెని పిండేసే సంఘటనలు ఏముంటాయి అనిపించింది. అంతగా నన్ను ఇక ఏ సంఘటనలు కదిలించలేదు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం. ఆయన జ్ఞాపకాలతో గడిపేయడమే’ అని సునీత ఎమోషనల్ అయింది. తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. ‘నాకంటూ కొన్ని విలువలు, బాధ్యతలున్నాయి. నన్ను విమర్శించేవారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాను. నేను ఏం చేయగలనో.. ఏం చేయాలో తెలుసు. ఆ క్లారిటీ నాకు ఉంది’ అని సునీత చెప్పుకొచ్చింది. మరి సునీత వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.