శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. శ్రావణ మాసం వచ్చిందంటే.. వ్రతాలు, పూజలతో మహిళలు సందడి చేస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు మహిళలు పెద్ద ఎత్తున వ్రతాలు, పూజలు చేస్తారు. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహిళలు కూడా లక్ష్మీదేవిలా ముస్తాబయ్యి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఈ పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. తాజాగా సింగర్ సునీత కూడా అమ్మవారి పూజల్లో నిమగ్నమయ్యారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా చక్కగా చీర కట్టుకుని, నిండు ముత్తయిదువులా ముస్తాబయ్యి..అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాట పాడుతూ అమ్మ వారికి హారతి ఇచ్చిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈమె 2021 డిసెంబర్ నెలలో ప్రముఖ బిజినెస్మేన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో వివాహం తర్వాత ఆమె చాలా సంతోషంగా ఉంటున్నారు. తన సంతోషాలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె శ్రావణ శుక్రవారం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో లక్ష్మీదేవిలా కనబడుతున్న సునీతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.