అమ్మాయిల పట్ల కొంత మంది అబ్బాయిలు బిహేవ్ చేసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ సింగర్ చిన్మయి. ప్రస్తుత స్పీడ్ యుగానికి అర్ధమయ్యేలా కాస్త ఘాటు భాషలోనే అమ్మాయిలు పై అబ్బాయిలకు ఉన్న అపోహల గురించి చెప్పుకొచ్చింది.
ప్రస్తుత సమాజంలో వైవాహిక జీవితానికి సంబంధించి చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉంటాయి. ముఖ్యంగా శృంగార విషయాల్లో వారికి అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఇక ఈ అపోహలు, అనుమానాలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటారు కొందరు. అయితే ఇలాంటి ఆలోచన విధానం, అమ్మాయిల పట్ల కొంత మంది అబ్బాయిలు బిహేవ్ చేసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ సింగర్ చిన్మయి. ప్రస్తుత స్పీడ్ యుగానికి అర్ధమయ్యేలా కాస్త ఘాటు భాషలోనే అమ్మాయిలు పై అబ్బాయిలకు ఉన్న అపోహల గురించి చెప్పుకొచ్చింది. శృంగారంలో పాల్గొంటుంటే.. టైట్ గా ఉంటేనో.. రక్తం వస్తేనే వర్జిన్ కాదు అంటూ బోల్డ్ గా సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ స్టార్ సింగర్.
సింగర్ చిన్మయి.. టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు సింగింగ్ తో పాటుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసుకుంది. ఇక చిన్మయి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే. మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ స్టార్ సింగర్. అయితే ఈ సారి మాత్రం కాస్త బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చింది చిన్మయి. ఆమె చెప్పిన విషయాలు నేటి సమాజంలో చాలా మందికి తెలీక తమ అపోహలను అనుమానాలుగా మర్చుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి అమ్మాయిల వర్జినిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
వర్జినిటీ గురించి చిన్మయి మాట్లాడుతూ..”అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు ఉన్నవన్ని అపోహలే. అబ్బాయిలు తొలి కలయికలో అమ్మాయిలకు నొప్పి ఉంటుంది అనుకుంటారు. కానీ అది అందరిలో ఉండదు. పైగా తొలి సారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు టైట్ గా ఉంటేనో.. లేదా రక్తం వస్తేనే వర్జిన్ అనుకోవద్దు. ఇలా జరిగే ప్రచారంలో నిజం లేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వర్జినిటీ విషయంలో అబ్బాయిల ఆలోచనలు మార్చాలనే తాను ఇలా బోల్డ్ గా మాట్లాడాను అని చెప్పుకొచ్చింది చిన్మయి. ఇక ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటే.. డాక్టర్ ను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఈ క్రమంలోనే ఇలాంటి విషయాలపై వచ్చే ట్రోల్స్ ను, విమర్శలను పట్టించుకోవద్దని ఆమె యువతకు సూచించారు. ఇక ఇందుకు సంబంధించిన ఓ ట్రోల్ వీడియోను షేర్ చేస్తూ.. ఈ విధంగా చెప్పుకొచ్చింది చిన్మయి. ఇక ఈ స్టేట్ మెంట్ ను చూసిన నెటిజన్లు సింగర్ చిన్మయిని తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె చెప్పిన విషయాలతో వారు ఏకీభవిస్తున్నారు. శృంగారానికి సంబంధించిన విషయాలపై అబ్బాయిల మైండ్ సెట్ మారాలని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి సెక్స్ విషయంలో నెలకొన్న అపోహలపై చిన్మయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.